E-Paper
Advertisement

ఆకాశం నుండి దిగిన మృత్యువు… అంతరిక్షం నుండే కూతురిని కాపాడుకున్న తండ్రి సాహసం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై థ్రిల్లర్

ఆకాశం నుండి దిగిన మృత్యువు… అంతరిక్షం నుండే కూతురిని కాపాడుకున్న తండ్రి సాహసం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై థ్రిల్లర్
Advertisement

Russian Sci Fi Thriller: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. భారీ విపత్తులు, కళ్లు చెదిరే విజువల్స్‌తో అంతరిక్షంలో చిక్కుకున్న ఒక తండ్రి భూమి మీద తన కూతురిని కాపాడేందుకు చేసే ప్రయత్నంతో ‘మీరా’ (Mira) అనే హాలీవుడ్ విజువల్ వండర్ తెరకెక్కింది. అదిరిపోయే వీఎఫ్ఎక్స్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ ఎమోషనల్ సై-ఫై థ్రిల్లర్ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఆకాశం నుండి ఉల్కలు పడే సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. వీకెండ్‌లో ఒక హై-వోల్టేజ్ సర్వైవల్ సై-ఫై థ్రిల్లర్ చూడాలనుకునే వారు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు.

కథలోకి వెళ్తే…

భవిష్యత్తులో రష్యాలోని వ్లాడివోస్టోక్ నగరంలో లెరా అరబోవా అనే 15 ఏళ్ల అమ్మాయి తన తల్లి స్వెత్లానా, సవతి తండ్రి బోరిస్, తమ్ముడు యెగోర్‌తో కలిసి జీవిస్తుంటుంది. ఆమె తండ్రి వాలెరీ అరబోవా ఒక వ్యోమగామి. ఎన్నో ఏళ్లుగా అంతరిక్షంలోని ‘మీరా’ స్పేస్ స్టేషన్‌లో పనిచేస్తుండటంతో కూతురికి దూరమవుతాడు. ఫోన్‌లో వినిపించే గొంతు తప్ప తండ్రి తనకు దగ్గరగా లేడనే అసంతృప్తి లెరాలో ఉంటుంది.

Advertisement

ఇలాంటి సమయంలో నగరంపై అనూహ్యంగా ఉల్కల వర్షం విరుచుకుపడుతుంది. మొదట అందమైన ఆకాశ అద్భుతంలా కనిపించిన ఈ దృశ్యం క్షణాల్లోనే భయంకరమైన విపత్తుగా మారుతుంది. భారీ ఉల్కలు భూమిని ఢీకొట్టడంతో భవనాలు కూలిపోతాయి, అగ్నిప్రమాదాలు చెలరేగుతాయి. నగరం మొత్తం విధ్వంసానికి గురవుతుంది. ఈ గందరగోళంలో లెరా తన కుటుంబాన్ని చేరుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తుంది.

అంతరిక్షంలో ఉన్న వాలెరీకి మాత్రం తన కూతురిని కాపాడుకునే అవకాశం ఒక్కటే ఉంటుంది. స్పేస్ స్టేషన్‌లోని సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్ నిఘా వ్యవస్థలు, ఫోన్ కమ్యూనికేషన్ సాయంతో లెరా కదలికలను గమనిస్తూ ఆమెకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటాడు. భూమిపై అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండగా, వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తండ్రి తన కూతురిని ఎలా రక్షించాడు? ఈ విపత్తు నుంచి లెరా, ఆమె కుటుంబం బయటపడ్డారా? అనేదే మిగతా కథ. విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ సీన్స్ కలగలిసిన ఈ చిత్రం మంచి సై-ఫై అనుభూతిని అందిస్తుంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

దిమిత్రి కిసెల్యోవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనటోలీ బెలీ వాలెరీ అరబోవాగా, వెరోనికా ఉస్టిమోవా లెరాగా, దర్యా మొరోజ్ స్వెత్లానాగా, మాక్సిమ్ లగాష్కిన్ బోరిస్‌గా నటించారు. యెవ్జెనీ యెగోరోవ్, ఆండ్రీ స్మోల్యాకోవ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. 2022 డిసెంబర్ 22న రష్యాలో విడుదలైన ఈ సినిమా సుమారు 1 గంట 50 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఈ మూవీ ప్రస్తుతం భారతదేశంలో JioHotstarతో పాటు Prime Videoలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం ఆడియోలో కూడా ఇది అందుబాటులో ఉంది.

Read Also: ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

Tags

Related News

9 ప్రాణాల్లో 8 పోగొట్టుకున్న పిల్లి… చివరి ప్రాణం కోసం భయంకరమైన తోడేలుతో పోరాటం.. పిల్లలకు, పెద్దలకు ఫుల్ మీల్స్

మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఇచ్చే శిక్ష ఇదేనా ? భూమి భవిష్యత్తును చూపించే ‘టైమ్ అండ్ వాటర్’

మూడేళ్లు కాపురం చేసిన ప్రియుడికి షాక్.. సడన్‌గా తిరిగొచ్చిన భర్త.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో ట్విస్టులే ట్విస్టులు

మైనర్ బాలికపై దారుణం.. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టే టెక్నాలజీ గ్యాంగ్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మామూలుగా ఉండదు భయ్యా

ఓటీటీలోకి తమిళ సునామీ… ఈ కంటెట్ అస్సలు మిస్ అవ్వద్దు

ఓటీటీలోకి 20 చిత్రాలు..ఆ 2 డోంట్ మిస్!

తండ్రి ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్‌లు వేసే కొడుకులు… ఒకరి ఎత్తుకు మరొకరి పైఎత్తు.. చూస్తే నవ్వులే నవ్వులు

Big Stories

Advertisement
×