OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఈ సినిమాలను చూడటానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా, కంటెంట్ బాగున్న ప్రతి సినిమాని ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. పరువు హత్యలు నేపథ్యంలో తేరకెక్కిన ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అడ్డ టైమ్స్ (Adda Times) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సద్దు విచారనే నాడేయుట్టిదే’ (Saddu Vicharane Nadeyuttide). కనిపించకుండా పోయిన జంటకు సంబంధించిన, ఒక సంక్లిష్టమైన కేసును క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభిస్తుంది. అయితే విషయం పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడుతుంది. ఇది ప్రజలలో, మీడియాలో కోలాహలానికి దారితీస్తుంది. ఈ మూవీకి భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అడ్డ టైమ్స్ (Adda Times) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కులాంతర వివాహం చేసుకున్నాక జనని, చందు అనే ఒక ప్రేమ జంట కనిపించకుండా పోతుంది. ఈ విషయం మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. కేసును త్వరగా పరిష్కరించాలని పోలీసులపై ఒత్తిడి పెరగడంతో, వినయ్ అనే స్పెషల్ ఆఫీసర్ కి ఈ కేసును అప్పగిస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు స్పెషల్ ఆఫీసర్ వినయ్. కనిపించకుండా పోయిన జనని పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవ్వడంతో పాటు, ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది. ఆ తరువాత ఆమె చందు అనే వ్యక్తిని ఇంట్లో వాళ్ళకి తెలీకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే కానిస్టేబుల్ ట్రైనింగ్ అయ్యాక ఇంట్లో ఈ విషయం చెప్పాలనుకుంటుంది. ఈలోగా జనని అక్క, తన మరిదితో వివాహం జరిపించాలనుకుంటుంది. అయితే తను ఈ పెళ్లి చేసుకోలేనని, తనకు ఇదివరకే పెళ్లి జరిగిపోయిందని ఇంట్లో చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది జనని. ఆ వ్యక్తి ఎవరని ఇంట్లో వాళ్ళు అడుగుతారు.
దానికి ఆమె సమాధానం చెప్పకుండా కేవలం ఫోటో మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే అతను ఎవరని చెప్తే, ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని భయపడుతుంది. అప్పటికే పెళ్లిచూపులుకు వచ్చిన పెళ్ళికొడుకు, ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి తన ఫ్రెండ్ గా గుర్తిస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒక రోజు కనిపించకుండా పోతారు. అదే ఊరిలో ఇద్దరిని ఒకచోట దారుణంగా చంపి ఉంటారు. పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి దిమ్మతిరిగే విషయాలు తెలుసుకుంటారు. చివరికి ఈ హత్యలను చేసింది ఎవరు? పరువు కోసమే ఈ హత్యలు చేశారా? మరి ఏదైనా కారణం ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అడ్డ టైమ్స్ (Adda Times) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సద్దు విచారనే నాడేయుట్టిదే’ (Saddu Vicharane Nadeyuttide) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.