BigTV English

OTT Movie : ఒక భార్య.. ఒక భర్త.. మధ్యలో ఒక అపరిచితుడు..

OTT Movie : ఒక భార్య.. ఒక భర్త.. మధ్యలో ఒక  అపరిచితుడు..

OTT Movie : హాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆస్కార్ అవార్డు పొందడానికి చాలా సినిమాలు పోటీ పడుతుంటాయి. వీటిలో విదేశీ కేటగిరీలో కూడా సినిమాలు ఉంటాయి. అయితే ఒక సింపుల్ కథాంశంతో తెరకెక్కిన ఇరానియన్ మూవీ, విదేశీ కేటగిరీలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఇద్దరు భార్య భర్తల మధ్య మూడవ వ్యక్తి చేసే ఒక తొందరపాటు పని వల్ల, ఆ ఫ్యామిలీ పడే ఇబ్బందుల చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ ఇరానియన్ మూవీ పేరు ‘ది సేల్స్‌మన్’  (The Salesman). అస్ఘర్‌ ఫర్హాదీ రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీలో తారాహేయిలో అలిడోయోస్టీ, షాహబ్‌ హోస్సేని నటించారు. ఈ మూవీ ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో కేన్స్‌ అవార్డును, ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ ను అందుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటారు. వీళ్లు నాటకాలు వేస్తూ తమ లైఫ్ని మరింత సంతోషంగా గడుపుతుంటారు. వీళ్ళు ఉంటున్న ఇల్లు డామేజ్ అవుతుండటంతో, మరో కొత్త ఇంటిలో అద్దెకు దిగుతారు. ఇదివరకే ఆ ఇంట్లో ఒక లేడీ నివసిస్తూ ఉండేది. ఆమె క్యారెక్టర్ బాగ లేకపోవడంతో ఇంటిని ఖాళీ చేపించి ఉంటారు. అయితే ఆమె ఫర్నిచర్ అందులోనే ఉంటుంది. దానిని తీసుకెళ్లడానికి కొంచెం సమయం కావాలని చెప్పి ఉంటుంది. హీరో, హీరోయిన్ ఒక నాటకంలో పార్టిసిపేట్ చేస్తారు. హీరోయిన్ తొందరగానే ఇంటికి వస్తుంది. హీరో ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక సూపర్ మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాడు. హీరోయిన్ ఇంటికి ఒక వ్యక్తి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. వీళ్ళు ఉండే ఇంటికి కాలింగ్ బెల్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది. వచ్చింది తన భర్త అనుకుని, డోర్ ఓపెన్ చేసి స్నానానికి వెళుతుంది.

ఆ తర్వాత భర్త ఇంట్లోకి వచ్చి చూస్తే ఇల్లంతా రక్తపు మరకలు ఉంటాయి. అతనికి ఆ ఇంటికి పక్కనే ఉండే ఒక ఫ్యామిలీ ఫోన్ చేసి హాస్పిటల్ కి రావలసిందిగా చెప్తారు. హాస్పిటల్ కి వెళ్లి చూస్తే, హీరోయిన్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంటికి హీరోయిన్ తీసుకొస్తాడు హీరో. భార్యను జరిగిన  విషయం అడిగి తెలుసుకుంటాడు. నిజానికి ఆ ఇంట్లో అంతకుముందు ఉన్న మహిళ, చెడు పనులు చేస్తూ ఉండేది. ఆమె కోసం ఒక కస్టమర్ వచ్చి ఉంటాడు. హీరోయిన్ ని చూసి ఆ వ్యక్తి దాడి చేసి వెళ్లిపోతాడు. ఇప్పుడు అతన్ని పట్టుకొని ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు హీరో. తన భార్యను దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టిన వాడికి హీరో బుద్ధి చెబుతాడా? ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×