BigTV English

OTT Movie : పరువు హత్యలకన్నా దారుణం… ప్రియురాలిని, చెల్లెల్ని కూడా వదలకుండా…

OTT Movie : పరువు హత్యలకన్నా దారుణం… ప్రియురాలిని, చెల్లెల్ని కూడా వదలకుండా…

OTT Movie : కులం మానవుడు సృష్టించుకున్న ఒక వ్యసనం. దీని బారిన పడి ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. ఈ వ్యసనం తగ్గకపోతే ఇంకెంతమంది బలి అవుతారో చెప్పడం కూడా కష్టమే. ఈ కంప్యూటర్ యుగంలో కూడా, వీటిని ప్రోత్సహిస్తూ రాజకీయ నాయకులు కూడా పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో అగ్రకులాల వాళ్ల చేతుల్లో, తక్కువ కులాల వాళ్ళు పడే నరకయాతన చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో

ఈ మూవీ పేరు ‘సైదులు’ (Saidulu). ఈ మూవీకి బాబా పి. ఆర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో దిగువ కులాల ప్రజలు తమ హక్కుల కోసం, కొంత గౌరవం కోసం అగ్ర కులాల వారితో పోరాడుతారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

సైదులు ఒక కొలిమి పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు అదే ఊరిలో ఉండే సుజాత అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. సుజాత సిటీలో లాయర్ కోర్స్ చదువుతూ ఉంటుంది. హాలిడేస్ కావడంతో పల్లెటూరు కి వస్తుంది. వీళ్ళంతా తక్కువ కులం వాళ్లు కావడంతో, ఊరికి దూరంగానే వీళ్ళ ఇండ్లు ఉంటాయి. ఆ ఊరికి పెద్దమనిషిగా కొండారెడ్డి ఉంటాడు. కొండారెడ్డి కట్టబోయే ఫ్యాక్టరీకి, సైదులు పొలం అడ్డంగా ఉంటుంది. దానిని సొంతం చేసుకోవాలని కొడుకు వీరారెడ్డికి చెప్తాడు. పొలం ఇవ్వాలని వీరారెడ్డి అడుగుతాడు. సైదులు అందుకు ఒప్పుకోకుండా వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్లు మనల్ని చంపేస్తారంటూ, సైదులు తండ్రి నరసయ్య ఆ పొలాన్ని కొండారెడ్డికి ఇస్తూ సంతకం కూడా పెడతాడు. ఇది తెలుసుకున్న సైదులు చాలా బాధ పడతాడు. ఆ తర్వాత వీరారెడ్డి అదే ఊర్లో ఉండే ఒక అమ్మాయి పై అఘాయిత్యం చేసి చంపేస్తాడు. అతనిపై కేసు పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది సుజాత.

ఆ తర్వాత సైదులు చెల్లెలికి వాళ్ల కన్నా, తక్కువ కులస్తుడైన వాడితో పెళ్లి కుదురుతుంది. ఒకసారి సైదులు చెల్లెలితో వీరారెడ్డి అసభ్యంగా మాట్లాడుతాడు. సైదులు కోపం తెచ్చుకొని వీరారెడ్డిని,అతని మనుషులను కొడతాడు. దీనిని అవమానంగా భావించిన వీరారెడ్డి, సైదులు చెల్లెలి పెళ్లి జరుగుతుండగా, సైదులును కొట్టి అతని చెల్లెలి పై అఘాయిత్యం చేస్తాడు. ఆ తర్వాత సుజాత, సైదులు చెల్లెలు వీరారెడ్డి పై కేసు పెట్టడానికి వెళ్తారు. మార్గమధ్యంలో వీళ్ళిద్దరిని కొండారెడ్డి మనుషులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు వాళ్ళిద్దరూ దారుణంగా చనిపోయి ఉంటారు. చివరికి ఆ ఊరి ప్రజలు  కొండారెడ్డిని ఎం చేస్తారు? ఆ ఊరిలో జరిగే ఆరాచకాలను ఎలా ఆపుతారు? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సైదులు’ (Saidulu) అనే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×