E-Paper
Advertisement

హెడ్ మాస్టర్ కూతురితో ప్రేమాయణం… మళ్లీ మళ్ళీ చూడాలన్పించే తెలుగు సిరీస్

హెడ్ మాస్టర్ కూతురితో ప్రేమాయణం… మళ్లీ మళ్ళీ చూడాలన్పించే తెలుగు సిరీస్
Advertisement

Telugu Family Comedy Series: ’90’s కిడ్స్ సిరీస్ ఇప్పటికే ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. మళ్లీ అదే నోస్టాల్జియాను రీక్రియేట్ చేస్తోంది తాజా తెలుగు సిరీస్ “Gurthukosthunnayi”. ఈ రోజు మీకోసం ఈ మధురమైన సిరీసే మన మూవీ సజెషన్. “గుర్తుకొస్తున్నాయి” సిరీస్ 2026 జూలై 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సంతోష్ (విరాజ్ అశ్విన్) చిన్నతనంలోనే తన స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) కుమార్తె వైశాలి (యశశ్రీ రావు)తో ప్రేమలో పడతాడు. రఘునాథ్ చాలా స్ట్రిక్ట్, రూల్స్‌ను కఠినంగా అమలు చేసే వ్యక్తి. సంతోష్ చిన్ననాటి ఫ్రెండ్స్ గ్యాంగ్.. గణేష్ (వైవా రాఘవ), శ్రీకాంత్ (పవన్ సిద్దు), బొమ్మ ఆనంద్ (గోదావరి గోపి)… స్కూల్ లో అల్లరి చేసి రఘునాథ్ చేతిలో ఎప్పుడూ దెబ్బలు తింటూనే ఉంటారు. ఆ కాలంలోని స్కూల్ బెల్స్, సైకిల్ రైడ్స్, క్రికెట్ మ్యాచ్‌లు, టిఫిన్ షేరింగ్ వంటి నోస్టాల్జిక్ మూమెంట్స్ సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

Advertisement

పెద్దయ్యాక సంతోష్ పద్ధతిగా మారాడని గ్రహించి రఘునాథ్ వీరి పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ ఒక షరతు పెడతాడు. చిన్నతనంలో సంతోష్ చేసిన ఒక పెద్ద తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబితేనే అల్లుడిగా అంగీకరిస్తానని మనసులో అనుకుంటాడు. పెళ్లి ముందు బ్యాచిలర్ పార్టీ కథకు టర్నింగ్ పాయింట్. పెళ్లి ఖాయమవడంతో సంతోష్ తన ముగ్గురు స్నేహితులతో గోవాకు బ్యాచిలర్ పార్టీకి బయలుదేరతాడు. కానీ మార్గమధ్యంలో భారీ రోడ్డు ప్రమాదం జరుగుతుంది. సంతోష్ తలకు గాయం కావడంతో షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వస్తుంది.

అతనికి చిన్ననాటి జ్ఞాపకాలు, స్కూల్ డేస్ ఏవీ గుర్తుండవు. కేవలం ప్రమాదానికి ముందు జరిగిన విషయాలు మాత్రమే మిగులుతాయి. పెళ్లికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సంతోష్‌కు గతం గుర్తులేదని తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని స్నేహితులు ఆందోళన చెందుతారు. దాంతో నిజాన్ని దాచిపెట్టి, సంతోష్‌కు గతం గుర్తుచేయడానికి ఎన్నో వింత ప్రయత్నాలు, నాటకాలు ఆడతారు. స్కూల్ డేస్ రీ-ఎనాక్ట్‌మెంట్స్, పాత ఫోటోలు, ఫ్రెండ్స్ గ్రూప్ ఫన్… ఇవన్నీ హిలేరియస్ సిట్యుయేషనల్ కామెడీని సృష్టిస్తాయి.

Advertisement

సంతోష్ పెళ్లి వేడుకల్లోనే తన గతాన్ని గుర్తుచేసుకోవడానికి పడే కష్టాలు సిరీస్‌లో మరింత కామెడీగా ఉంటాయి. మరి హీరోకి గతం జ్ఞాపకం వచ్చిందా లేదా ? హెడ్ మాస్టర్ పంతం నెరవేరిందా ? ఇంతకీ హీరో హీరోయిన్ల పెళ్లి జరిగిందా లేదా ? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవలసిన కథ.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఈ సిరీస్‌లో రోహిణి హట్టంగడి, శివన్నారాయణ, గోపరాజు రమణ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. అజయ్ అర్సాడ అద్భుత నోస్టాల్జిక్ సంగీతం అందించాడు. 90s స్కూల్ లైఫ్, సైకిల్ రైడ్స్, టిఫిన్ షేరింగ్, ఫ్రెండ్స్ గ్యాంగ్ ఫన్ – ఈ ఎలిమెంట్స్ మనల్ని మన చిన్ననాటి రోజుల్లోకి తీసుకెళ్తాయి. కామెడీ కూడా కావలసినంత ఉంది. ETV Winలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. వినోద్ గాలి దర్శకత్వంలో, ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ క్లాసిక్ “Naduvula Konjam Pakkatha Kaanom” స్ఫూర్తితో, 90s-2000s కిడ్స్ జ్ఞాపకాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ సిరీస్ ను డోంట్ మిస్.

Read Also : ఈ ఇంట్లోకి అమ్మాయి అడుగు పెడితే అంతే సంగతులు… కితకితలు పెట్టే మలయాళం ఫ్యామిలీ డ్రామా

Tags

Related News

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

చనిపోయిన ప్రతిసారీ మళ్లీ బతుకుతాడు… ఏలియన్స్‌తో యుద్ధం గెలిచే వరకు ఆగని టైమ్ లూప్… మైండ్ బ్లాక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×