E-Paper
Advertisement

ఈ థ్రిల్లర్ సిరీస్ IMDbలో 9.2 రేటింగ్‌… ఇందులో అంతగా ఏముందంటే ?

ఈ థ్రిల్లర్ సిరీస్ IMDbలో 9.2 రేటింగ్‌… ఇందులో అంతగా ఏముందంటే ?
Advertisement

Thriller Series OTT : ఓటీటీలలో ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు గనుక వెబ్ సిరీస్‌ల అభిమాని అయ్యి ఉంటే, ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. IMDbలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో ఒకటిగా ఇది కూడా స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సిరీస్‌ కు ఏకంగా 9.2 రేటింగ్ ఉండడం విశేషం. మరి అంత క్రేజీ రేటింగ్ సంపాదించిన ఈ సిరీస్ ఏంటి ? ఇందులో ఏముంది ? అనేది తెలుసుకుందాం పదండి.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వెబ్ సిరీస్ పేరు “స్కామ్ 1992” (Scam 1992 The Harshad Mehta Story). భారతదేశంలోనే అత్యధిక రేటింగ్ పొందిన వెబ్ సిరీస్‌లలో ఇదొకటి. ఇందులో 10 ఎపిసోడ్‌లు ఉండగా, ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నుండి 60 నిమిషాల నిడివి సాగుతుంది. ప్రస్తుతం దీనిని సోనీలివ్‌ (SonyLIV) లో చూడవచ్చు. ఇక ఈ సిరీస్ కథ ఒక్కటే కాదు నటీనటులు కూడా హైలెట్ అని చెప్పాలి. 2020లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ లో ప్రతీక్ గాంధీ, శ్రేయా ధన్వంతరి, హేమంత్ ఖేర్, అంజలి బరోట్, రజత్ కపూర్ తదితరులు నటించారు. ఈ సిరీస్ దేశంలోని అతిపెద్ద కుంభకోణాలలో ఒకదాని ఆధారంగా రూపొందడం విశేషం. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ ‘బిగ్ బుల్’గా పేరుగాంచిన వ్యక్తి హర్షద్ మెహతా. ఆ కాలంలో అతను ఓ అతిపెద్ద కుంభకోణాన్ని ఎలా నడిపించాడో ఈ సిరీస్ లో చూసి తెలుసుకోవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సీరీస్ 1980 -90ల నాటి ముంబై నేపథ్యంగా హర్షద్ మెహతా (ప్రతీక్ గాంధీ) చుట్టూ తిరుగుతుంది. ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతానికి చెందిన మధ్యతరగతి యువకుడే హర్షద్ మెహతా (ప్రతీక్ గాంధీ). స్టాక్ మార్కెట్‌ లో సాధారణ ఎంప్లొయ్ గా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అయితే అక్కడ జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే అతను అక్కడి లోటుపాట్లను చక్కగా అర్థం చేసుకుంటాడు. ధైర్యం చేసి, తన తెలివితేటలు ఉపయోగించి, వ్యవస్థలోని లొసుగులను వాడుకోవడం మొదలు పెడ్తాడు. ఫలితంగా అనతి కాలంలోనే ‘ద బిగ్ బుల్’, ‘స్టాక్ మార్కెట్ అమితాబ్ బచ్చన్’గా ఎదుగుతాడు. “రిస్క్ హై తో ఇష్క్ హై” అనే డైలాగ్‌ తో సామాన్యులను కూడా స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేసేలా చేస్తాడు.

Also Read : నడిరోడ్డుపై నరకం… ఫ్రెండ్స్ తో ట్రిప్ కు వెళ్ళి దిక్కుమాలిన చావు

Advertisement

హర్షద్ మెహతా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను వాడి ఇంత ఎత్తుకు ఎదుగుతాడు. ముఖ్యంగా ‘రెడీ ఫార్వర్డ్ డీల్స్’, ‘బ్యాంక్ రిసీట్స్’ (BRs) ను ఉపయోగించి వేల కోట్ల రూపాయలను స్టాక్ మార్కెట్‌ లోకి మళ్లించి, కొన్ని కంపెనీల షేర్ల ధరలు ఆకాశాన్ని తాకేలా చేస్తాడు. అయితే ఇక్కడిదాకా అంతాబ్ బాగానే ఉంటుంది. జర్నలిస్ట్ సుచేతా దలాల్ ఎంట్రీతో అంతా తలకిందులు అవుతుంది. ఈ భారీ ఎదుగుదలకు కారణం ఏంటా అని ఫైనాన్షియల్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ (శ్రేయా ధన్వంతరి) ఆరా తీస్తుంది. ఎస్బిఐ (SBI) ఖాతాల్లో ఉన్న రూ. 500 కోట్ల నిధుల వ్యత్యాసాన్ని కనిపెట్టి ఈ భారీ స్కామ్‌ బయట పడేలా చేస్తుంది. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది. మరి ఈ పతనం ఎఫెక్ట్ హర్షద్ మెహతాపై ఎలాంటి ప్రభావం చూపించింది ? చివరికి అతని పరిస్థితి ఏమైంది ? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×