E-Paper
Advertisement

గర్భనిరోధక మాత్రల పేరుతో సైనైడ్ ఇచ్చి చంపే సైకో… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

గర్భనిరోధక మాత్రల పేరుతో సైనైడ్ ఇచ్చి చంపే సైకో… లాస్ట్ ట్విస్ట్ హైలెట్
Advertisement

Crime Thriller OTT: 2009 ఉత్తరప్రదేశ్‌లో మాయమైన 19 మంది యువతుల వెనుక ఉన్న క్రూరమైన సైకో కిల్లర్ సమీర్ (జితేంద్ర కుమార్) ను డీఎస్పీ విశ్వాస్ భగవత్ ఎలా పట్టుకున్నాడు ? పోలీస్ – కిల్లర్ మధ్య జరిగిన చదరంగం లాంటి మైండ్ గేమ్‌ ఏంటి ? అనే ఇంట్రస్టింగ్ విషయాలను చూపే సైకో-సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘భగవత్: చాప్టర్ వన్ – రాక్షస్’ (Bhagwat Chapter One – Raakshas). మరి ఈ మూవీ కంప్లీట్ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. కావాల్సిన ఏజ్ లో పెళ్లి కాకపోతే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా టెన్షన్ పడడం అనేది కామన్. కానీ అలా టెన్షన్ పడ్డ అమ్మాయిలంతా వరుసగా మిస్ అవుతూ ఉంటారు సినిమాలో. నగరంలో పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్న ఒంటరి అమ్మాయిలు ఒక పద్ధతి ప్రకారం కన్పించకుండా పోతారు. దీంతో ఈ కేసును ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు ఇన్వెస్టిగేషన్ కోసం చేరుతుంది.

Advertisement

పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సైకో కిల్లర్ కు సంబంధించిన షాకింగ్ నిజం బయట పడుతుంది. ఆ సైకో అమ్మాయిలను ఆకర్షించి, వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుంటాడు. ఆ తర్వాత వారికి గర్భనిరోధక మాత్రలు ఇస్తున్నట్టు అబద్ధం చెప్పి సైనైడ్ మాత్రలు ఇస్తాడు. అవి తిన్న అమ్మాయిలు పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లలో ప్రాణాలు కోల్పోతారు. అదే టైమ్ లో పక్కనే ఉండే కిల్లర్ కాపాడకుండా, వాళ్ళు బాధతో అల్లాడుతూ చావడాన్ని చూసి తెగ సంతోష పడతాడు. మరి ఇంతటి క్రూరమైన కిల్లర్ పోలీసులు ఎలా పట్టుకున్నారనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో ఉందా ?

2025లో విడుదలైన ఈ మైండ్-బెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ మూవీ. సైనైడ్ మోహన్ ఉదంతం ఆధారంగా తెరకెక్కిన సంచలనాత్మక సినిమా. ఇన్‌స్పెక్టర్ విశ్వాస్ భగవత్‌గా అర్షద్ వార్సి, సైకో ప్రొఫెసర్ సమీర్‌గా జితేంద్ర కుమార్ తమ నటనతో అదరగొట్టారు. 19 మంది మహిళల హత్యల చుట్టూ సాగే ఈ సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ చిత్రంలో 2009లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సీరియల్ కిల్లర్ ఘటనలను ఆవిష్కరించారు. ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా క్షణక్షణం ఉత్కంఠను కలిగిస్తూ, సైకోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో కళ్ళకు కడుతుంది. ‘భగవత్ చాప్టర్ వన్ – రాక్షస్’ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది.మైండ్ బ్లోయింగ్ సైకో కిల్లర్ సినిమాలను, రియల్ స్టోరీస్ ను చూడాలి అనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఇంకా చూడకపోతే డోంట్ మిస్.

Advertisement

Read Also: 6 ఎపిసోడ్లు… చివరి వరకూ సీట్ ఎడ్జ్ థ్రిల్లున్న కొరియన్ సస్పెన్స్ సైకలాజికల్ డ్రామా

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×