E-Paper
Advertisement

హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్… సీతమ్మ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్… సీతమ్మ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్
Advertisement

Bengali Movie: సమాజంలో మహిళలపై ఎంత చిన్న చూపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సినిమా రంగంలో అయితే నటీమణులను ఇంకా హీనంగా చూస్తారు. అభిమానుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ, ఇలా హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడుతూ ఇబ్బంది పెట్టే వారి సంఖ్య కూడా తక్కువేం లేదు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ల ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ డొమైన్లలో చర్చకు దారి తీసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. హీరోయిన్లపై జరిగే దారుణాల గురించి ఆలోచింపజేసేలా తెరకెక్కిన ఈ సినిమా పేరు “Take One”. 2014లో విడుదలైన ఈ బెంగాలీ డ్రామాను ఏ ఓటీటీలో చూడొచ్చు ? అసలు కథ ఏంటి ? అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

పాపులర్ హీరోయిన్ దోయల్ మిశ్రా చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆమెకు ఇండిపెండెంట్ గా ఉండడం అంటేనే ఇష్టం. పైగా సమాజం విధించే కట్టుబాట్లను పక్కన పెట్టి, తనకు నచ్చినట్టుగా బతుకుతుంది. కానీ అంతలోనే ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. దోయల్ ఓ అంతర్జాతీయ సినిమాలో నటిస్తుంది. అందులో ఆమె నటించిన ఒక బోల్డ్ సీన్ లీక్ అవుతుంది. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఆమె స్టార్ డం కుప్పకూలుతుంది. అంతేకాదు తీవ్ర వివాదాలు చుట్టుముడతాయి.

Advertisement

సంప్రదాయవాదులు, మీడియా, సమాజం ఆమెను నటిగా కాకుండా, క్యారెక్టర్ లేని స్త్రీగా చూడటం మొదలు పెడుతుంది. విమర్శించడమే కాదు కించపరుస్తూ కామెంట్స్ చేస్తారు. దీనివల్ల ఆమె పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు రేటింగుల కోసం దోయెల్‌ను టార్గెట్ చేసి, ఆమె సంస్కృతిని చెడగొడుతోంది అంటూ డిబేట్లు పెడతాయి. బయటకు వెళ్తే జనం వింతగా చూస్తూ, అసభ్యకరమైన కామెంట్లు చేస్తారు. చివరికి ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే జర్నలిస్టులు కూడా సినిమా గురించి కాకుండా, ఆ సీన్ గురించే ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతారు. .

ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే.. ఆమె ఒక ప్రతిష్టాత్మక భారతీయ సినిమాలో నటిస్తుంది. అందులో “సీత” పాత్రను పోషిస్తుంది. పవిత్రమైన సీత పాత్రను ఒక వివాదాస్పద నటి ఎలా పోషిస్తుందంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి ఒత్తిడిని, సమాజం వేసే నిందలను దోయెల్ ఎలా ఎదుర్కొంటుంది ? తన జీవితాన్ని, కెరీర్‌ను ఎలా నిలబెట్టుకుంది ? అనేదే మిగతా కథ.

Advertisement

2014లో విడుదలైన “టేక్ వన్” (Take One) అనే ఈ బెంగాలీ చిత్రం ఒరిజినల్ భాష అయిన బెంగాలీలో మాత్రమే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మూడు ఓటీటీలలో ZEE5, Hoichoi, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ తెలుగులో లేదు. ప్రముఖ నటి స్వస్తిక ముఖర్జీ నటించిన ఈ మూవీని ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Read Also: తండ్రి ప్రియురాలు ఎంట్రీ… శవాన్ని పూడ్చే సమయంలో అన్నదమ్ములకు దిమాక్ ఖరాబ్ షాక్

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×