E-Paper
Advertisement

హైటెక్ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో అరాచకం… మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్…

హైటెక్ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో అరాచకం… మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్…
Advertisement

Sci Fi Thriller Series: నచ్చినట్టుగా బతకడానికి, ఫాంటసీలను, కోరికలను తీర్చుకోవడానికి మనకంటూ ప్రత్యేకంగా ఒక ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుందో కదా. కానీ ఆ కోరికలు కాస్తా హద్దు దాటితే అది మనుషులైనా… లేక రోబోలైనా వినాశనం తప్పదు. అచ్చం ఇలాంటి క్రేజీ స్టోరీ లైన్ తో రూపొందిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సిరిస్ ‘వెస్ట్ వరల్డ్’ (Westworld) ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ పూర్తి కథ ఏంటి ? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ మొత్తం వెస్ట్ వరల్డ్ అనే ఒక అత్యాధునిక థీమ్ పార్క్ చుట్టూ నడుస్తుంది. ధనికులు తమకు నచ్చిన ఫ్యాంటసీలను, కోరికలను తీర్చుకోవడానికి ఈ పార్కుకు వెళ్తారు. ఇక్కడ పాతకాలపు అమెరికన్ వైల్డ్ వెస్ట్ వాతావరణం ని క్రియేట్ చేశారు. ఇక ఈ పార్క్ లో మనుషులలాగే కనిపించే, మాట్లాడే వందలాది ఏఐ అంటే కృత్రిమ మేధస్సు ఉన్న ఆండ్రాయిడ్ రోబోలు ఉంటాయి. ఈ రోబోలను హోస్టులు అని పిలుస్తారు. ఈ పార్కుకు వచ్చే విదేశీయులు ఈ రోబోలను ఏం చేసినా సరే అడిగే నాధుడు ఉండడు. అయితే ప్రతిరోజూ ఎండింగ్లో ఈ రోబోల జ్ఞాపకాలను చెరిపేసి మళ్ళీ కొత్తగా రీసెట్ చేస్తారు.

Advertisement

వినడానికి క్రేజీగా ఉన్నప్పటికీ ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. పార్క్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాబర్ట్ ఫోర్ట్ రోబోల సాఫ్ట్వేర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తాడు. దీంతో డోలోరేస్, మే అనే కొన్ని ముఖ్యమైన రోబోలకు పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. తమను మనుషులు ఆట వస్తువులుగా వాడుకుంటూ, క్రూరంగా హింసిస్తున్నారని ఈ రోబోలు గుర్తిస్తాయి. తమను సృష్టించిన మానవజాతి పైనే రివెంజ్ తీర్చుకోవడానికి తిరుగుబాటుకు సిద్ధమవుతాయి. మరి మానవ నైజంలోని క్రూరత్వం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకునే రివెంజ్ తో… మనుషులకు – రోబోలకు మధ్య జరిగే మైండ్ గేమ్, యాక్షన్, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయన్నది స్టోరీ.

ఇక ఈ సిరీస్ ఓటీటీ విషయానికి వస్తే… ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. నిజానికి ఒకప్పుడు ఈ సిరీస్ హాట్ స్టార్ లో, జియో సినిమాలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు హెచ్బిఓ ఒప్పందాల మార్పుల వల్ల ఈ సిరీస్ ఓటిటి ప్లాట్ఫారం కూడా మారింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ తెలుగు వెర్షన్ లో లేదు. ఒకవేళ ఈ సిరీస్ ని చూడాలంటే ఇంగ్లీష్ లోనే చూడాల్సిన ఉంటుంది.

Advertisement

Read Also: తండ్రి ప్రియురాలు ఎంట్రీ… శవాన్ని పూడ్చే సమయంలో అన్నదమ్ములకు దిమాక్ ఖరాబ్ షాక్

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×