IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. గ్రూప్ స్టేజ్ లో మొత్తం 70 మ్యాచ్ లు జరగాల్సింది. అంటే మార్చి 28వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ మే 31వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలు కూడా ఖరారు అయ్యాయి. ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడే ప్లేయర్లకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). హనీ ట్రాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. హోటల్ గదిలోకి ఎవరికి పర్మిషన్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈగ కూడా క్రికెటర్ల గదుల్లోకి వెళ్లకూడదని బిసిసిఐ దిశ నిర్దేశం చేసింది.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో ప్లేయర్ లందరికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠినమైన రూల్స్ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ క్రికెటర్ల క్రమశిక్షణ అలాగే సెక్యూరిటీ పకడ్బందీగా ఉండేందుకుగాను కొత్త మార్గదర్శకాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి జారీ చేయడం జరిగింది. మేనేజర్ అనుమతి లేకుండా ఇతరులకు ఆటగాళ్ల గదుల్లోకి ప్రవేశం లేదని కూడా తాజాగా వెల్లడించింది. సెక్యూరిటీ క్లియరెన్స్ లేనిదే ప్లేయర్లు హోటల్ బయటకు వెళ్లకూడదని కండిషన్ పెట్టింది.
అక్రిడేషన్ కార్డులు తప్పనిసరిగా ధరించాలని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. హనీ ట్రాప్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది. హనీ ట్రాప్ ద్వారా క్రికెటర్లను డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉన్నట్లు బిసిసిఐ అంచనాకు వచ్చింది. అందుకే ఈ హనీ ట్రాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మ్యాచ్ టైంలో డగౌట్ లోని ప్లేయర్లతో ఓనర్లు అస్సలు మాట్లాడకూడదు అని కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇకపై భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో స్టేడియంలో సంబరాలు, రూంలోకి తీసుకెళ్లడం చేయకూడదని పేర్కొంది. ఈ రూల్స్ శుక్రవారం నుంచి అమలు కానున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ రూల్ ప్రకారం బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ చాలా తెలివిగా ఆలోచించి మళ్లీ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైనల్ మ్యాచ్ ను తన్నుకు వెళ్ళింది. కర్ణాటక కు సంబంధించిన ప్రభుత్వంతోపాటు అక్కడి క్రికెట్ బోర్డు ఎక్కువ టికెట్లను ఆశిస్తోందట. అందుకే చిన్న స్వామి కాకుండా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని సెలెక్ట్ చేశారట.
🚨 BCCI'S WARNING FOR IPL TEAMS 🚨
– BCCI warns IPL teams over honey trap risks, and tightens hotel room access rules.
– Anti-Corruption Unit (ACSU) on high alert after a businessman with links to bookies tried to befriend players, offering expensive gifts. pic.twitter.com/Hi2C54kwVJ— Cricket Central (@CricketCentrl) May 7, 2026