E-Paper
Advertisement

ఓటీటీలోకి బ్రహ్మాజీ మిస్టరీ థ్రిల్లర్… ఎట్టకేలకు ఆరేళ్ళ తరువాత ఎంట్రీ

ఓటీటీలోకి బ్రహ్మాజీ మిస్టరీ థ్రిల్లర్… ఎట్టకేలకు ఆరేళ్ళ తరువాత ఎంట్రీ
Advertisement

Mystery Thriller: టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో బ్రహ్మాజీ కూడా ఒకరు. ఆయన తెలుగులో ఇప్పటిదాకా ఎన్నో విభిన్న పాత్రలను పోషించి, తెలుగు సినిమా ఇండస్రీలో సినీయర్ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించిన Hangman Movie మూవీ ఓటీటీలోకి రాబోతోంది. దాదాపు ఆరేళ్ళ తరువాత ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అవ్వడం విశేషం. మరి ఈ మిస్టరీ థ్రిల్లర్ ను ఎక్కడ, ఎప్పుడు చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

3 రోజుల్లో ఓటీటీలోకి…

2020లో బ్రహ్మాజీ ‘హ్యాంగ్‌మ్యాన్’ అనే ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్‌ ను ప్రకటించారు. 6 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిత్ర నిర్మాతలు థియేటర్లలో విడుదల చేయకుండా డైరెక్ట్ గా డిజిటల్ ప్రీమియర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘హ్యాంగ్‌మ్యాన్’ జూలై 3 నుండి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు “న్యాయానికి ఒక మూల్యం ఉంది. సత్యానికి ఒక గడువు ఉంది” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ప్రచార కార్యక్రమం ఉత్సుకతను రేకెత్తించింది. అదే సమయంలో “హ్యాంగ్‌మ్యాన్ దాగి ఉన్న నిజాన్ని వెలికితీస్తాడా లేక శాశ్వతంగా పాతిపెడతాడా?” అనే ప్రశ్నను సంధిస్తోంది.

ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సందడి

Advertisement

ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మిస్టరీ థ్రిల్లర్‌గా నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ వృద్ధుడి వేషధారణలో కనిపించి ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. డిజిటల్ రంగంలోకి ప్రవేశించడానికి ముందు, ఈ మూవీ 2వ ఐఖోయిగి ఇంఫాల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితం అవ్వగా, ‘హ్యాంగ్‌మ్యాన్’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక ఈ చిత్రంలో బన్నీ అభిరాన్, వినయ్ నల్లకడి కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు. విహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కామ్రాన్ నేపథ్య సంగీతాన్ని అందించగా, దీనిని క్లోరోఫిల్మ్ పిక్చర్స్ – డార్క్ హార్స్ విజువల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ కోసం బ్రహ్మాజీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించడం విశేషం. పాత్ర నచ్చడంతో ఆయన ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట.

కథలోకి వెళ్తే..

ఈ సినిమాలో బ్రహ్మాజీ ‘శివయ్య’ అనే ప్రభుత్వ తలారి పాత్రలో కన్పిస్తారు. జైలులో ఉరిశిక్ష పడిన ఖైదీలను ఉరితీయడం ఇతని జాబ్. మరి అలాంటి తలారి జీవితం ఎలా ఉంటుంది ? చట్ట ప్రకారం ఒక ప్రాణాన్ని తీసేటప్పుడు అతను మానసికంగా ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు ? అనే కోణంలో ఈ సినిమాను తీశారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న శివయ్య, న్యాయ స్థానం నుంచి తప్పించుకుంటున్న నేరస్థులకు ఎలాంటి శిక్ష వేశాడు అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే. మరి ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Advertisement

Read Also: యాక్సిడెంట్ కేసులో అడ్డంగా ఇరుక్కునే పోలీస్… మిస్టీరియస్ మనిషి బ్లాక్ మెయిల్ తో మెంటలెక్కించే ట్విస్ట్

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×