E-Paper
Advertisement

ప్రయోగం బెడిసి కొట్టి సూపర్ పవర్స్… మార్వెల్, డీసీ సూపర్ హీరోలను మరిపించే సిరీస్

ప్రయోగం బెడిసి కొట్టి సూపర్ పవర్స్… మార్వెల్, డీసీ సూపర్ హీరోలను మరిపించే సిరీస్
Advertisement

Superhero Series: సూపర్ హీరో సిరీసులు అంటే ఇష్టమా ? ఇప్పటికే మార్వెల్, డీసీ సిరీస్ లు చూసి సరిపెట్టుకుంటున్నారా ? అయితే మీరో మంచి సూపర్ హీరో సిరీస్ ను మిస్ అవుతున్నట్టే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా అచ్చం మార్వెల్ సిరీస్ ల లాగే ఉంటుంది. కాకపోతే స్టోరీ ఇంకాస్త డిఫరెంట్ గా, నేటి ఆడియన్స్ మెచ్చే బ్లడీ బ్లడ్ బాత్ తో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ‘ది బాయ్స్’ తరహాలో ఉంటుంది. 2022లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ సూపర్‌హీరో సిరీస్ “ది ఇంపర్ఫెక్ట్స్” (The Imperfects) తెలుగులో అందుబాటులో ఉందా ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ అబ్బి (Rhianna Jagpal), టిల్డా (Morgan Taylor Campbell), జువాన్ (Iñaki Godoy) అనే ముగ్గురు యువతీ యువకుల చుట్టూ తిరుగుతుంది. నిజానికి ఈ ముగ్గురు ఒక వింత జన్యుపరమైన వ్యాధితో బాధ పడుతుంటారు. దానికి ట్రీట్మెంట్ ఇస్తానని చెబుతాడు డాక్టర్ అలెక్స్ సార్కోవ్. కానీ ఈ క్రేజీ సైంటిస్ట్ చేసే ఒక ప్రయోగాత్మక “జీన్ థెరపీ” (Gene Therapy)ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రయోగం వికటించి, వారి డిఎన్‌ఏ పూర్తిగా మారిపోతుంది.

Advertisement

ఈ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా వారికి ఊహించని రాక్షస శక్తులు వస్తాయి. అబ్బికి ఎదుటి వారిని తన వశం చేసుకునే ‘సక్యూబస్’ శక్తి ఉంటే, టిల్డాకు గట్టిగా అరిచి వస్తువులను ధ్వంసం చేసే ‘బాన్షీ’ శక్తి, చివరగా జువాన్‌ కు తోడేలుగా మారే ‘చుపాకాబ్రా’ శక్తి వస్తాయి. ఈ శక్తులు వారి సాధారణ జీవితాలను తలకిందులు చేస్తాయి. దీంతో వారు మళ్లీ సాధారణ మనుషులుగా మారడానికి, ఆ ప్రయోగానికి కారణమైన సైంటిస్ట్‌ ను వెతికి పట్టుకుని, తమకు విరుగుడు కనుక్కోవాలని ఒక టీమ్‌గా ఏర్పడి ప్రయాణం షురూ చేస్తారు.

ఆ అన్వేషణలో వారికి ఎదురైన సవాళ్లు, ప్రభుత్వ సంస్థల నుండి తప్పించుకునే క్రమంలో జరిగే పోరాటమే ఈ సిరీస్ లో చూడాల్సిన మిగతా స్టోరీ. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, సూపర్‌హీరో డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ సీజన్ 1 లో మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు 40 నుండి 45 నిమిషాల నిడివి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను మొదటి సీజన్ తర్వాత క్యాన్సిల్ చేసింది. కాబట్టి దీనికి సీజన్ 2 లేదు. ఇక భాష విషయానికొస్తే… ప్రస్తుతం తెలుగు ఆడియోలో అందుబాటులో లేదు. ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో కేవలం ఇంగ్లీష్ ఒరిజినల్ వెర్షన్ తో పాటు హిందీ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×