E-Paper
Advertisement

ఈ ఆడదెయ్యానికి దేవుళ్లంతా బంధువులే… ప్యాంట్ తడిపించే సీన్లు మావా

ఈ ఆడదెయ్యానికి దేవుళ్లంతా బంధువులే… ప్యాంట్ తడిపించే సీన్లు మావా
Advertisement

Supernatural Horror Movie: మోహినీ వంటి పిశాచాల గురించి వినే ఉంటారు. ఒక్కసారి పట్టుకున్నాయంటే ఓ పట్టాన వదలవు ఈ దెయ్యాలు. అయితే దెయ్యమైనా, పిశాచి అయినా… దేవుడు, దేవుడికి సంబంధించిన శక్తివంతమైన వస్తువులు అంటే భయపడతాయని అందరూ నమ్ముతారు. అందుకే ఎప్పుడన్నా భయం వేస్తే హనుమాన్ చాలీసా అందుకుంటారు. కానీ ఆ దెయ్యమే హనుమాన్ మంత్రాలు పఠిస్తే ఎలా ఉంటుంది ? హనుమాన్ కే కాదు అల్లాతో పాటు జీసస్ కు కూడా భయపడని దెయ్యం ఎదురు పడితే ఏంటి పరిస్థితి ? అది తెలియాలంటే Aseq అనే టైటిల్ తో వచ్చిన ఈ హిందీ మూవీని చూడాల్సిందే.

కథలోకి వెళ్తే…

ఈ మూవీ అంతా జిన్ అనే ఒక అతీత శక్తి, దాని పిచ్చి ప్రేమ చుట్టూ తిరుగుతుంది. అసెక్ అంటే ఉర్దూ లేదా అరబిక్ సంస్కృతిలో ఒక వ్యక్తిపై తీవ్రమైన వ్యామోహం, పిచ్చి ప్రేమను పెంచుకునే ప్రమాదకరమైన జీని అని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే మగాళ్లు కనిపిస్తే పట్టి, పీల్చి పిప్పి చేసే ఆడపిశాచి అన్నమాట. ఇక కథలోకి వెళ్తే… ఇందులో మన హీరో పేరు రోనీ. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు ప్రియాంక. అయితే ప్రాణంగా ప్రేమించుకున్న వీరిద్దరికీ బ్రేకప్ జరుగుతుంది. దీంతో రోని తీవ్రంగా పొంగిపోతాడు.

Advertisement

ఇది జరిగిన కొంతకాలానికి రోని జీవితంలోకి లైల్ అనే మరో అమ్మాయి వస్తుంది. ఆమెతో కూడా ప్రేమలో పడతాడు. ఇక లవ్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వడంతో కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు హీరో. కానీ ఈ ప్రేమాయణం మొదలైనప్పటి నుంచి రోనీ జీవితంలో వింతగా భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతుంది. రోనికి రాత్రి అయితే చాలు భయంకరమైన శబ్దాలు వినిపించడంతో పాటు ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యే దృశ్యాలు కనిపిస్తాయి.

దీంతో తన జీవితంలో జరుగుతున్న ఈ అతింద్రియ సంఘటనలకు తన మాజీ ప్రియురాలు ప్రియాంకనే కారణం అని అనుకుంటాడు. అంతేకాదు ఆమె చేతబడి చేయించిందని నమ్ముతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది చేతబడి కాదు. ఈ సమస్య నుంచి బయటపడడానికి రోనీ తన ఫ్రెండ్స్ సరిమ్, ఆదిల హెల్ప్ తీసుకుంటాడు. రంగంలోకి దిగిన ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. అదేంటంటే రోనిని వెంటాడుతుంది ప్రియాంక కాదు. అతని వెనుక అసక్ అనే ఒక భయంకరమైన పిశాచి పడిందని తెలుస్తుంది. మరి ఆ జిన్ నుంచి రోని తన ప్రాణాలను, తన కొత్త ప్రేమికులరాలిని ఎలా కాపాడుకున్నాడు ? అసలు అది రోని వెనక ఎందుకు పడింది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Advertisement

ఇక ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ విషయానికి వస్తే… ‘అసెక్’ మూవీ హిందీలో మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ అందుబాటులో లేదు. హిందీలో లేదంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడొచ్చు.

Read Also: యాక్సిడెంట్ కేసులో అడ్డంగా ఇరుక్కునే పోలీస్… మిస్టీరియస్ మనిషి బ్లాక్ మెయిల్ తో మెంటలెక్కించే ట్విస్ట్

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×