E-Paper
Advertisement

అమ్మాయిపై అఘాయిత్యం, ఐదుగురు ఎన్కౌంటర్… హైదరాబాద్ ను షేక్ చేసిన రియల్ స్టోరీ

అమ్మాయిపై అఘాయిత్యం, ఐదుగురు ఎన్కౌంటర్… హైదరాబాద్ ను షేక్ చేసిన రియల్ స్టోరీ
Advertisement

Crime Thriller Movie: కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ లో జరిగిన ఎన్కౌంటర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మాయిపై అఘాయిత్యం కేసులో ఇలా జరగడంతో నిజంగా చాలామంది సంతోషించారు. కానీ అమాయకులను పోలీసులు ఇలా బలి తీసుకున్నారు అనే విమర్శలు కూడా విన్పించాయి. అచ్చం అలాంటి స్టోరీ లైన్ తోనే రూపొందిన మూవీ “V3: వింధ్య విక్టిమ్ వెర్డిక్ట్” (Vindhya Victim Verdict V3). 2023లో విడుదలైన ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్లో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రను పోషించారు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలను తెలుసుకునే ముందు కథపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

వేలాయుధం అనే వ్యక్తి ఇద్దరు కూతుళ్ల తండ్రి. ఆ అమ్మాయిల పేర్లు విద్య, విజయ. తల్లి లేకపోవడంతో వారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు ఆయన. అయితే ఒకరోజు చదువుకుంటూ తన ఆశయాలను నెరవేర్చుకోవాలనుకునే పెద్ద కూతురు విద్యపై ఐదుగురు యువకులు దారుణంగా అఘాయిత్యం చేస్తారు. ఆ ఘటన అనంతరం ఆమెను చంపేస్తారు. ఈ ఘోరమైన నేరం జరిగిన కొన్ని రోజుల్లోనే పోలీసులు అలర్ట్ అయి, ఆ ఐదుగురు నిందితులను వెతికి పట్టుకుంటారు. ఇక్కడే కథ ఊపందుకుంటుంది.

Advertisement

ఆ నిందితులకు పోలీసులే స్వయంగా ‘ఎన్‌కౌంటర్’ చేసి చంపేస్తారు. ఈ ఎన్‌కౌంటర్‌ తో బాధితురాలి తండ్రికి న్యాయం జరిగిందని, చుట్టుపక్కల జనం, మీడియా పోలీసులపై పూలవర్షం కురిపిస్తూ అభినందిస్తారు. ట్విస్ట్ ఏంటంటే… కేసులోకి మానవ హక్కుల కమిషన్ ఎంట్రీ ఇస్తుంది. ఒకవైపు పోలీసులకు ప్రశంసలు దక్కుతున్నా.. మరోవైపు మానవ హక్కుల సంఘాలు ఇది చట్టవిరుద్ధమని, రాజకీయ ఒత్తిళ్ల వల్ల జరిగిన “ఫేక్ ఎన్‌కౌంటర్” అని విమర్శిస్తాయి. ఈ ఎన్‌కౌంటర్ వెనుక ఉన్న అసలు నిజాన్ని వెలికితీసే బాధ్యతను ఐఏఎస్ అధికారిణి శివగామి (వరలక్ష్మి శరత్‌కుమార్) కి ప్రభుత్వం అప్పగిస్తుంది.

శివగామి ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగుతుంది. దర్యాప్తులో అందులో భాగంగా ఆమెకు షాకింగ్ నిజాలు తెలిస్తాయి. అసలు ఆ ఐదుగురు యువకులు నిజంగానే తప్పు చేశారా ? లేక రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న పెద్దమనుషుల పిల్లలను కాపాడటం కోసం పోలీసులు ఈ అమాయకులను బలి తీసుకున్నారా ? ఈ ఫేక్ ఎన్‌కౌంటర్ వెనుక దాగున్న నిజాలు ఏంటి అనేది శివగామి ఎలా నిరూపించింది? బాధితురాలికి వ్యవస్థ ద్వారా నిజమైన న్యాయం ఎలా దక్కింది ? అనేదే ఈ సినిమా కథ.

Advertisement

వరలక్ష్మి శరత్‌కుమార్, పావన గౌడ, ఎస్తేర్ అనిల్, ఆడుకలం నరేన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. P. అముధవానన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 నాటి న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ తమిళ మూవీ తమిళంలోనే Astro Movies అనే అంతర్జాతీయ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: పిల్లలను తిరుగులేని కిల్లర్స్‌గా మార్చే ప్రాజెక్ట్… ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు ఈ సిరీస్

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×