OTT Movie : ముంబైలో జాగృతి పాఠక్ అనే ఒక క్రైమ్ రిపోర్టర్, శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్స్, అవినీతి అధికారుల గురించి రాసే సంచలన కథనాలతో జర్నలిజం ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించింది. కానీ ఒక రోజు ఆమె జీవితం భయంకరమైన మలుపు తిరుగుతుంది. ఆమె సహోద్యోగి జర్నలిస్ట్ జ్యోతిర్మోయ్ డే బహిరంగంగా హత్య చేయబడతాడు. ఆమె ఈ హత్య కేసులో ప్రధాన అనుమానితురాలిగా మారుతుంది. ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులు అవుతుంది. ఆమెను అరెస్ట్ చేసి జైలులో బంధిస్తారు. ఆ తరువాత ఆమె ఈ అన్యాయపు వ్యవస్థను ఎదిరించగలదా, లేక ఈ కుట్రలో ఆమె కూడా బలిపశువు అవుతుందా? ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
జాగృతి పాఠక్ (కరిష్మా తన్నా) ఒక ప్రముఖ క్రైమ్ రిపోర్టర్‌గా, ఆసియా టైమ్స్ అనే వార్తాపత్రికలో డిప్యూటీ బ్యూరో చీఫ్‌గా పనిచేస్తుంది. ఆమె ముంబై అండర్‌వరల్డ్, గ్యాంగ్‌స్టర్‌లు, పోలీసు వ్యవస్థలోని అవినీతి గురించి సంచలన కథనాలు రాస్తూ గుర్తింపు పొందుతుంది. ఆమె ప్రస్తుతం తన సహోద్యోగి ఇమ్రాన్ (మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్), ఎడిటర్ జైదేబ్ సేన్ (ప్రోసెంజిత్ చటర్జీ)తో కలిసి ముంబైలో జరిగే సీరియల్ బాంబు దాడులు, అండర్‌వరల్డ్ చీకటి కార్యకలాపాలపై కథనాలు రాస్తుంది. ఆమె జీవితం ఒక సాధారణ క్రైమ్ రిపోర్టర్‌గా కొనసాగుతుండగా, ఒక రోజు జైదేబ్ సేన్ అనే వ్యక్తి బహిరంగంగా హత్య చేయబడతాడు. ఈ కేసులో జాగృతి అనుమానితురాలిగా మారుతుంది.
పోలీసు విచారణలో, జాగృతి అండర్‌వరల్డ్ సోర్సెస్‌తో ఆమె సంబంధాలు, ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌తో ఆమె కమ్యూనికేషన్, ఆమెపై అనుమానం కలిగిస్తాయి. ఆమెను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి జైలులో బంధిస్తారు. అక్కడ ఆమె కఠినమైన జైలు జీవితాన్ని గడుపుతుంది. జైలులో ఆమె ఇతర ఖైదీలతో కూడా ఇబ్బందులు పడుతుంది. జాగృతి అరెస్ట్ కారణంగా ఆమె భర్త హర్షవర్ధన్ (హర్మన్ బవేజా), కొడుకు చాలా బాధపడతారు. ఆమె సహోద్యోగులు కూడా ఆమెపై వెన్నుపోటు పొడిచి, ఆమె గురించి తప్పుడు పుకార్లు ప్రచారం చేస్తారు.
జాగృతి, తన జర్నలిస్టిక్ నైపుణ్యాలను ఉపయోగించి, జైలు నుండే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె సహోద్యోగి ఇమ్రాన్, ఆమెకు మద్దతుగా నిలుస్తాడు. జైదేబ్ సేన్ హత్యకు కారణమైన ఆధారాలు సేకరిస్తాడు. ఈ సిరీస్ ముంబై అండర్‌వరల్డ్, మీడియా ఒత్తిళ్లు, పోలీసు అవినీతి మధ్య ఒక సర్కిలా తిరుగుతుంది. చివరికి జాగృతి ఈ కేసు నుంచి బయట పడుతుందా ? ఆ హత్యను చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : 9 ఏళ్ల పిల్లాడి చుట్టూ తిరిగే ఆత్మలు… IMDbలో 8.2 రేటింగ్ తో భయపెడుతున్న హర్రర్ థ్రిల్లర్
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ సిరీస్ పేరు ‘స్కూప్’ (Scoop). 2023 లో వచ్చిన ఈ సిరీస్ ను హన్సల్ మెహతా, మృణ్మయీ లాగూ వైకుల్ రూపొందించారు. హిందీ భాషలో వచ్చిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. 6 ఎపిసోడ్‌లతో, ప్రతి ఎపిసోడ్ సుమారు 52-61 నిమిషాలు ఉన్న ఈ సిరీస్ కి IMDbలో 7.6/10 రేటింగ్ ఉంది. ఇందులో కరిష్మా తన్నా (జాగృతి పాఠక్), మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్ (ఇమ్రాన్), హర్మన్ బవేజా (హర్షవర్ధన్), ప్రోసెంజిత్ చటర్జీ (జైదేబ్ సేన్), ఇనాయత్ సూద్, తన్నిష్ట చటర్జీ (దీపా), దేవెన్ భోజానీ వంటి నటులు నటించారు.ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. దీనికి 2023 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌లో ఉత్తమ డ్రామా సిరీస్, ఉత్తమ నటి (క్రిటిక్స్ – కరిష్మా తన్నా) అవార్డులు కూడా వచ్చాయి.