OTT Movie : మార్గరెట్ డైనో అనే ఒక అమెరికన్ మహిళ రోమ్ లో ఉండే చర్చిలో సేవ చేయడానికి, నన్‌గా తన జీవితాన్ని ప్రారంభించడానికి ఉత్సాహంగా వస్తుంది. కానీ ఆమె అడుగుపెట్టిన ఈ ప్రదేశం చీకటి రహస్యాలతో నిండి ఉంటుంది. అక్కడ జరిగే వింత సంఘటనలు, భయంకరమైన దృశ్యాలు, ఆమె చుట్టూ ఉన్నవారి విచిత్రమైన ప్రవర్తన వల్ల ఇబ్బందులు పడుతుంది. ఒక వ్యక్తి అక్కడ జరిగే భయంకరమైన కుట్ర గురించి హెచ్చరిస్తాడు. చర్చిలోని కొందరు సాతాను అవతారాన్ని ఆరాధిస్తున్నారని ఆమె తెలుసుకుంటుంది. ఆమె ఈ దెయ్యం శక్తులను ఎదిరించగలదా, లేక ఈ భయంకరమైన కుట్రలో ఆమె కూడా బలిపశువు అవుతుందా? ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీ లో ఉంది ? ఈ విషయాల గురించి తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1971లో రోమ్‌లో ప్రారంభమవుతుంది. ఒక అమెరికన్ మహిళ మార్గరెట్ డైనో (నెల్ టైగర్ ఫ్రీ), నన్‌గా తన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక కాథలిక్ అనాథాశ్రమంలో చేరుతుంది. ఆమెకు కార్డినల్ లారెన్స్ (బిల్ నై) అనే వ్యక్తి ఆహ్వానిస్తాడు. ఆమె తన రూమ్‌మేట్ లూజ్ వెలెజ్ (మరియా కాబల్లెరో) కలసి ఉంటుంది. ఇక వచ్చీ రాగానే మార్గరెట్ అనాథాశ్రమంలో వింత సంఘటనలను గమనిస్తుంది. అక్కడ కార్లిటా (నికోల్ సోరాస్) అనే ఒక అనాథ బాలిక విచిత్రంగా ఉంటుంది. మార్గరెట్ కూడా ఒకప్పుడు అనాథగా ఉండటం వల్ల, కార్లిటాతో ఒక బంధాన్ని ఏర్పరుచుకుంటుంది. అనాథాశ్రమంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఒక గర్భిణీ స్త్రీ ఒక దెయ్యం పిల్లకి జన్మనిస్తుంది. ఇది మార్గరెట్‌ను షాక్‌లో ముంచెత్తుతుంది. ఆమె అక్కడ జరిగే విషయాలమీద అనుమానం వస్తుంది.
ఫాదర్ బ్రెన్నాన్ (రాల్ఫ్ ఇనెసన్) చర్చిలోని కొందరు సాతాను అవతారం, యాంటీక్రైస్ట్‌ను జన్మనివ్వడానికి ఒక కుట్రలో ఉన్నారని హెచ్చరిస్తాడు. మార్గరెట్ మొదట ఈ హెచ్చరికలను నమ్మడానికి ఇష్టపడదు. కానీ అనాథాశ్రమంలో జరిగే భయంకరమైన సంఘటనల వాళ్ళ అసలు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది మార్గరెట్. అనాథాశ్రమంలో ఉండే కొన్ని పాడు బడిన గదులలో భయంకరమైన వైద్య ప్రయోగాలు, సాతాను ఆరాధనకు సంబంధించిన ఆధారాలను మార్గరెట్ గుర్తిస్తుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. చివరికి మార్గరెట్ కనిపెట్టిన రహస్యాలు ఏమిటి ? అనాథాశ్రమంలో ఆమె ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటుంది ? దుష్ట శక్తులను ఎవరు ఆరాధిస్తున్నారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : రిచ్ ఫ్యామిలీలో వరుస ఆత్మహత్యలు… 11 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయే కారణమా? వణికించే మలయాళ హర్రర్ మూవీ
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ఫస్ట్ ఓమెన్’ (The First Omen). 2024 లో వచ్చిన ఈ సినిమాకి అర్కాషా స్టీవెన్‌సన్ దర్శకత్వం వహించారు. 1 గంట 59 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది. ఇందులో నెల్ టైగర్ ఫ్రీ (మార్గరెట్ డైనో), టాఫీక్ బర్హోమ్ (ఫాదర్ గాబ్రియేల్), సోనియా బ్రాగా (సిస్టర్ సిల్వా), రాల్ఫ్ ఇనెసన్ (ఫాదర్ బ్రెన్నాన్), బిల్ నై (కార్డినల్ లారెన్స్), మరియా కాబల్లెరో (లూజ్ వెలెజ్), నికోల్ సోరాస్ (కార్లిటా) వంటి నటులు నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.