BigTV English

OTT Movie : మత్తులో ఉండగానే పేషెంట్లు మాయం … ఒక్కొక్కరికీ నరకం చూపిస్తూ … పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మత్తులో ఉండగానే పేషెంట్లు మాయం … ఒక్కొక్కరికీ నరకం చూపిస్తూ … పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒక రోజు షారిన్ బెర్క్లీ అనే మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్తుంది. ఆమెకు అత్యవసర అపెండిసైటిస్ సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్తారు. ఈ సర్జరీ తరువాత ఆమె ఒక వింత భవనంలో కళ్ళు తెరిచి చూస్తుంది. అక్కడ ఆమె చేతులు సంకెళ్లతో బంధించబడి ఉంటాయి. ఆమెకి సర్జరీ చేసిన గాయం కూడా దాదాపు మానిపోయి ఉంటుంది. ఈ భవనంలో డాక్టర్ హెలెన్‌బాచ్ నేతృత్వంలోని వైద్యులు ఒక అద్భుతమైన ‘ఆంటిడోట్’తో ప్రయోగాలు చేస్తుంటారు. అది అన్ని రోగాలను నయం చేస్తుందని, దానిని అమ్మి బాగా డబ్బులు సంపాదించాలని ఆ డాక్టర్ ప్లాన్. ఇందుకు షారిన్ ని ఒక ప్రయోగం కోసం రహస్యంగా బంధిస్తారు.  అక్కడినుంచి బయట పడుతుందా ? లేకపోతే ఈ దుర్మార్గపు ప్రయోగాలలో బలిపశువు అవుతుందా? ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

షారిన్ బెర్క్లీ (అష్లిన్ యెన్నీ) అనే ఒక వివాహిత మహిళ, తన భర్త (యోర్గోస్ కరమిహోస్), కుమార్తెతో కలిసి జీవిస్తుంటుంది. ఒక రోజు ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడ ఆమెకు అపెండిసైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. అత్యవసర సర్జరీ అవసరమని చెప్పి ఆపరేషన్ కూడా చేస్తారు. ఈ సర్జరీ తర్వాత షారిన్ ఒక చీకటి గదిలో మేల్కుంటుంది. ఆమె చేతులు సంకెళ్లతో బంధించబడి ఉంటాయి. ఆమె సర్జరీ కోత దాదాపు పూర్తిగా మానిపోయి ఉంటుంది. ఇంత త్వరగా ఇది సాధ్యం కాదని ఆమె అనుమానిస్తుంది. డాక్టర్ ఆరోన్ హెలెన్‌బాచ్ (లూయిస్ మాండిలోర్) ఆమెను కలుస్తాడు. కానీ ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఈ ఫసిలిటీలో ‘అసాధారణ వైద్య పరీక్షలు’  జరుగుతున్నాయని మాత్రమే చెప్తాడు. షారిన్‌కు తన కుటుంబం ఎక్కడ ఉందో , ఆమె ఎందుకు బంధించబడిందో తెలియక భయపడుతూ ఉంటుంది.


షారిన్ తన గది నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫసిలిటీలో ఇతర రోగులు కూడా ఉన్నారని తెలుసుకుంటుంది. వాళ్ళు కూడా భయంకరమైన వైద్య ప్రయోగాలకు గురవుతుంటారు. ఆమె తన గది గోడలోని ఒక రంధ్రం ద్వారా పక్క గదిలోని ఎవెరెట్ అనే వ్యక్తి తో కమ్యూనికేట్ అవుతుంది. అతను ఆమెకు ఈ ఫెసిలిటీ గురించి ఒక భయంకరమైన సమాచారం ఇస్తాడు. ఆమె అక్కడ రక్తస్రావంతో ఉన్న ఒక వ్యక్తిని చూస్తుంది. కానీ అతని గాయాలు వెంటనే మనిపోతుంటాయి. ఈ ఫసిలిటీలో రోగులు క్రమం తప్పకుండా ప్రయోగాల కోసం హింసించబడుతున్నారని, వాళ్ళు ఒక రహస్యమైన “ఆంటిడోట్” ద్వారా నయం చేయబడుతున్నారని ఆమె తెలుసుకుంటుంది.

ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా, షారిన్ యొక్క గతం గురించి కొన్ని వివరాలు వెల్లడవుతాయి. ఆమె వివాహం, ఆమె కుమార్తె, ఆమె జీవితంలోని కొన్ని చీకటి క్షణాలు ఇవి ఆమె ఈ ఫసిలిటీలో ఎందుకు ఉందనే రహస్యంతో ముడిపడి ఉంటాయి. ఇక షారిన్ ఈ ఫసిలిటీ చీకటి రహస్యాలను కనిపెడుతూ, అక్కడినుంచి తప్పించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ క్రమంలో కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది.చివరికి షారిన్ అక్కడినుంచి తప్పించుకుంటుందా ? ఆమె అక్కడ ఉండటానికి కారణం ఎవరు ?ఈ ప్రయోగాలు చెపిస్తోంది ఎవరు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : స్మగ్లింగ్ కోసం నెవర్ బిఫోర్ ప్లాన్… పోలీసులకే చుక్కలు చూపించే డెడ్లీ స్నైపర్‌… యాక్షన్-ప్యాక్డ్ డెడ్లీ గేమ్‌

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఆంటిడోట్’ (Antidote). 2021 లో వచ్చిన ఈ సినిమాకి పీటర్ డస్కలాఫ్ దర్శకత్వం వహించారు. ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది. 1 గంట 30 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 4.9/10 రేటింగ్ ఉంది. ఇందులో అష్లిన్ యెన్నీ (షారిన్ బెర్క్లీ), లూయిస్ మాండిలోర్ (డాక్టర్ ఆరోన్ హెలెన్‌బాచ్), ఆగీ డ్యూక్ (కసాండ్రా ఫ్రాంక్లిన్), రవి నాయుడు (ఎవెరెట్), యోర్గోస్ కరమిహోస్ (షారిన్ భర్త), క్రిస్టోస్ వాసిలోపౌలోస్ (రిజ్జో)వంటి నటులు ఉన్నారు.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×