Thriller Movie OTT : ఓటీటీ లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఓటీటీలో కూడా అదే టాక్ ని అందుకుంటాయి. ఈమధ్య వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. థియేటర్లలో సూపర్ హిట్ సినిమాలు తో పాటు ఓటిటిలో ఆసక్తికర కంటెంట్ సినిమాలో రిలీజ్ అవుతుండడంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఇక్కడ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నిత్యం ఏదో ఒక సినిమా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి రాబోతుంది.. ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
మూవీ & ఓటీటీ..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గతేడాది ఈ ఏడాది వచ్చిన సినిమా పర్వాలేదనిపించాయి. అంతకు ముందు వచ్చిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా పెద్దగా తెలియలేదు.. అలాంటి సినిమాలల్లో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన మూవీ సెబాస్టియన్ పీసీ 524.. థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.. అలాగే ఆహా ఓటీటీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే చూడొచ్చు.. ఇందులో హీరోయిన్ గా కోమలి ప్రసాద్ నటించింది. రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు..
Also Read:హీరోనే గుర్తుపట్టడం లేదు… అయ్యగారికి ఇదెక్కడి సమస్యరా నాయనా…?
స్టోరీ విషయానికొస్తే..
మూడేళ్ల క్రితం రిలీజ్ అయింది. కాన్సెప్ట్ కొత్తదే అయినా దానిని తెరపై ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడ లేకపోయింది. రేచీకటి సమస్యతో బాధపడే పోలీస్ కానిస్టేబుల్‌గా కిరణ్ అబ్బవరం నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. నా సమస్యని దాచిపెట్టి జాబ్లో జాయిన్ అవుతాడు. అయితే తన గురించి ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇక చివరికి అతను డ్యూటీలో ఉండగా ఓ అమ్మాయి దారుణమైన హత్యకు గురవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది ఆ మర్డర్ ని ఎవరు చేశారు అనేది బయట పెట్టడానికి కానిస్టేబుల్ ప్రయత్నాలు చేస్తాడు.. మరి అతని సమస్య గురించి బయట పెట్టాడా లేక దాచి పెట్టి హత్య ఎవరు చేసారు? అన్న విషయాన్ని కనిపెట్టాడా? అన్నది ఈ సినిమా స్టోరీలో చూడాల్సిందే.. కిరణ్ అబ్బవరం క మూవీతో తిరిగి విజయాల బాట పట్టాడు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ర్యాంప్ పేరుతో థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. త్వరలోనే మూవీ ప్రేక్షకులు ముందుకు రాబోతుందని తెలుస్తుంది..