OTT Movie : హారర్ సినిమాలు రకరకాల కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. అయితే వీటిలో వణుకు పుట్టించే సినిమాలతో పాటు కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఈ రెండు అంశాలు కలిపి ఉంటాయి. ఓ పక్క భయపెడుతూనే, మరోపక్క నవ్విస్తూ ఉంటుంది ఈ సినిమా. ఈ హర్రర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కామెడీ హర్రర్ మూవీ పేరు ‘2001 మేనియాక్స్’ (2001 Maniacs). దీనికి టిమ్ సుల్లివన్ దర్శకత్వం వహించారు. ఇందులో రాబర్ట్ ఇంగ్లండ్, లిన్ షే, జే గిల్లెస్పీ, డైలాన్ ఎడ్రింగ్‌టన్, మాథ్యూ కారీ నటించారు. ఈ సినిమా 1964 లో వచ్చిన ‘Two Thousand Maniacs’ అనే చిత్రానికి రీమేక్. దీనికి అప్పట్లో హెర్షెల్ గోర్డాన్ లూయిస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని లయన్స్ గేట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పంపిణీ చేసింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
కొంత మంది కాలేజీ విద్యార్థుల ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌కి వెళ్తుంటారు. అక్కడ సరదాగా గడపడానికి ఈ ట్రిప్ కి ప్లాన్ చేస్తారు. అయితే అనుకోకుండా వాళ్ళు దారి తప్పిపోతారు. వాళ్ళంతా దక్షిణాది పట్టణమైన ప్లెజెంట్ వ్యాలీలోకి వెళ్తారు. ఆ సమయంలో, ఈ పట్టణంలో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంత మేయర్ బక్‌మన్ వీళ్ళను అక్కడ జరగబోయే ఉత్సవంలో పాల్గొనమని ఆహ్వానిస్తాడు. అయితే, ఈ ఆహ్వానం వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంటుంది. ప్లెజెంట్ వ్యాలీ నివాసులు వాస్తవానికి అమెరికన్ సివిల్ వార్ సమయంలో, యూనియన్ సైనికుల చేతిలో దారుణంగా చనిపోయిఉంటారు. ఇప్పుడు ఆ ప్రాంతం లో వాళ్ళు ఆత్మలు గా తిరుగుతుంటారు. వారు ఆ యుద్ధంలో తమ పట్టణం నాశనం కావడానికి, ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటారు. ఈ విద్యార్థులు ఉత్తరాది వాసులు కావడంతో, వారిని ఒక్కొక్కరినీ భయంకరమైన రీతిలో చంపుకుంటూ పోతారు.
ఒక పక్క రక్తపాతంతో ఆ ప్రాంతం నిండి పోతూ ఉంటే, మరోపక్క ఆ దెయ్యాలు ప్రతీకారానందాన్ని పొందుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో చిక్కుకున్న ఎనిమిది మంది (ఆండర్సన్, కోరీ, నెల్సన్, మాల్కం, లియా, కాట్, రికీ, జోయ్) ఒక్కొక్కరూ భయంకరమైన రీతిలో చనిపోతారు. ఒకరిని గుర్రాలతో లాగి చంపుతారు, మరొకరిని రసాయణాలతో కాల్చివేస్తారు. చివరికి కొందరు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారు కూడా ఈ దెయ్యాల పట్టణం నుండి బయటపడలేరు. వాళ్ళ తలలు కూడా తెగిపడతాయి ? చివరికి ఈ దయ్యాల ఊబిలో ఎంత మంది చిక్కుకుంటారు ? ఆ దెయ్యాలకు ప్రతీకారం తీరుతుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా కామెడీ, హారర్‌ను మిక్స్ చేసిన ఒక స్లాషర్ ఫిల్మ్‌గా తెరకెక్కింది.
Also Read : బిగ్ స్క్రీన్ పై బ్యాన్ అయిన మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీస్… ఇండియాలో ఏ ఓటిటిలో చూడొచ్చంటే?