Godari Gattupaina: ఈరోజుల్లో ప్రమోషన్స్ కొత్తగా ఉంటేనే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. అందుకే మేకర్స్ అంతా తమ సినిమాలను క్రియేటివ్‌గా ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజుల్లో సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో.. ప్రమోషన్స్ కోసం కూడా అంతే కష్టపడుతున్నారు. ఈమధ్య కాలంలో ఒక మూవీ షూటింగ్ ప్రారంభమయిన మొదటి రోజు నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టేస్తున్నారు మేకర్స్. తాజాగా ఒక యంగ్ హీరో కూడా అదే పనిచేశాడు. ఇటీవల తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేశాడు యంగ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్. టైటిల్ రివీల్ చేసిన రెండు రోజుల తర్వాత అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది మూవీ టీమ్.
కాంట్రవర్సీతో ప్రమోషన్స్
యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas). ఆ తర్వాత వెండితెరపై హీరోగా కూడా మారాడు. కొన్నిరోజుల క్రితం ‘మేమ్ ఫేమస్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడు తను హీరోగా రెండో సినిమా తెరకెక్కడానికి సిద్ధమయ్యింది. అదే ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను తాజాగా రివీల్ చేయడంతో పాటు అప్పుడే ప్రేమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇటీవల అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘గోదారి గట్టుపైన’ పాట బాగా ఫేమస్ అయ్యింది. అదే పేరుతో ఇప్పుడు సినిమా తెరకెక్కుతుందని మేకర్సే కాంట్రవర్సీ క్రియేట్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
కాపీ కొట్టారు
గోదారి జిల్లాలో బాగా కాంట్రవర్సీలు జరుగుతున్నాయని కామెడియన్ ప్రవీణ్ ఒక న్యూస్ రిపోర్టర్‌గా మారి ‘గోదారి గట్టుపైన’ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టాడు. అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయని సుమంత్ ప్రభాస్‌తో పాటు మరో ఇద్దరు నటులను కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ కాంట్రవర్సీలు ఏం జరగడం లేదని, షూటింగ్ జరుగుతుందని, సినిమా పేరు గోదారి గట్టుపైన అని క్లారిటీ ఇచ్చాడు సుమంత్ ప్రభాస్. ‘‘సినిమాకు కొత్తగా టైటిల్ పెడదామనే ఆలోచన ఎవ్వరికీ రాదు. కాపీ కొట్టడం అంతే. రీసెంట్‌గా ఒక సాంగ్ వచ్చి హిట్ అయితే దాని లిరిక్ తీసుకొచ్చి సినిమాలకు టైటిల్ పెట్టేయడం అంతే’’ అనే స్టేట్‌మెంట్‌తో చాలామందికి కౌంటర్ ఇచ్చాడు ప్రవీణ్.
Also Read: హీరోనే గుర్తుపట్టడం లేదు.. అయ్యగారికి ఇదెక్కడి సమస్యరా నాయనా.?
అందుకే ఆ టైటిల్
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసిన తర్వాతే ‘గోదారి గట్టుపైన’ (Godari Gattupaina) అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రవీణ్ అనగా.. అసలు ఈ లిరిక్‌తో ఉన్న ఫేమస్ పాటలను ఇతర యాక్టర్లు గుర్తుచేస్తారు. దీంతో ఈ లిరిక్‌తో ఇన్ని పాటలు ఉన్నాయా అని ప్రేక్షకులకు సైతం సందేహం కలుగుతుంది. ‘‘గోదారి గట్టుపైన నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది.? ఆ ఫీల్ మా సినిమాలో ఉంటుంది కాబట్టి టైటిల్ సింక్ అవుతుందని పెట్టాం’’ అంటూ అసలు ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటో క్లారిటీ ఇచ్చాడు సుమంత్ ప్రభాస్. మొత్తానికి ‘మేమ్ ఫేమస్’తో క్లీన్ హిట్ కొట్టిన సుమంత్ ప్రభాస్.. ‘గోదారి గట్టుపైన’తో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.
టైటిల్ కాపీ కొట్టిన గోదారి గట్టు టీం?
A Subash Chandra Film #GodariGattupaina #GG@RedPuppetMovies @SumanthPrabha_s @subash1240 pic.twitter.com/R8p4Vpoyzc
— Vamsi Kaka (@vamsikaka) April 9, 2025