BigTV English

OTT Movie : భార్యను లేపేయడానికి భర్త మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : భార్యను లేపేయడానికి భర్త మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా తోడయ్యాయి. సీరియల్స్ లా సాగదీయకుండా, మంచి థ్రిల్ కలిగించే విధంగా వీటిని తెరకెక్కిస్తున్నారు. అందులోనూ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరిస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో భార్యను చంపడానికి భర్త పథకం వేస్తాడు. ఎందుకంటే అతను మరదలితో యవ్వారం నడుపుతుంటాడు. ఈ సిరీస్ చివరి వరకు ఉత్కంఠంగా సాగుతుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జీ 5 (Zee 5) లో

ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘షడ్యంత్ర’ (Shadyantra). 2022లో విడుదలైన ఈ హిందీ వెబ్ సిరీస్ కు గణేష్ యాదవ్ దర్శకత్వం వహించారు. ఇది డ్రీమ్స్ ఫిల్మ్స్ OTT ప్లాట్‌ ఫామ్‌లో ప్రసారం అయింది. ప్రస్తుతం జీ 5 (Zee 5) లో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో ప్రియా గామ్రే, గౌరవ్ సింగ్, లీనా సింగ్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ను రొమాన్స్ డ్రామా జోనర్‌లో తెరకెక్కించారు. దీని మొదటి సీజన్ ఆగస్టు 26, 2022న విడుదలైంది.


స్టోరీలోకి వెళితే

ఈ వెబ్ సిరీస్ భార్య, భర్త ల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇందులో రోహన్, నటాషా భార్య భర్తలు గా ఉంటారు. నటాషాకి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది. దానిని రోహన్ హ్యాండిల్ చేస్తుంటాడు. ఒకరోజు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కూలిపోతుంది. అందులో చాలామంది చనిపోతారు. ఈ విషయంపై నటాషా భర్తతో సీరియస్ గా ఉంటుంది. అతను కూడా డబ్బులకు కక్కుర్తి పడి నాసిరకంగా పని చేపిస్తుంటాడు. మరోవైపు రోహన్ మరొక అమ్మాయి ప్రేమలో ఉంటాడు. ఆమె మరెవరో కాదు భార్యకి సొంత చెల్లెలు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటాడు. చాలా రోజుల నుంచి భార్యను చంపాలి అని కుట్ర పన్నుతాడు. అయితే కొన్నిసార్లు అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. అనుకోకుండా ఈ విషయం భార్యకి కూడా తెలిసిపోతుంది. తన భర్త ఇలా ఆలోచిస్తున్నాడని తెలిసి చాలా బాధపడుతుంది. చివరికి రోహన్ తన భార్యని చంపతాడా? భర్తకి భార్య బుద్ధి చెబుతుందా? రోహన్ ఎఫైర్ ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్‌లోని పాత్రలు ఒకరిపై ఒకరు ఆకర్షితులై, వారి కోరికలు, ఆలోచనల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సందర్భంలో ఏర్పడే కుట్రలు, వాటి పరిణామాలు సిరీస్‌ పేరుకు తగ్గట్టుగా ఉంటాయి. ఈ కథలో రొమాన్స్‌తో పాటు కొంత ఉత్కంఠ రేపే సన్నివేశాలు కూడా ఉంటాయి. ‘షడ్యంత్ర’ సీజన్ 1 కథ పూర్తిగా అర్ధమయ్యే రీతిలో ఉంటుంది. కాబట్టి సీజన్ 2 చూడాలనుకునే వారు సీజన్ 1 చూడకపోయినా అర్థం చేసుకోవచ్చు. సీజన్ 2 డిసెంబర్ 30, 2022న విడుదలైంది. సీజన్ 2 లో కథ ఒక స్పెషల్ ట్యూషన్ టీచర్ చుట్టూ తిరుగుతుంది.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×