MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Chennai Super Kings vs Rajasthan Royals ) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చివరి క్షణంలో… రాజస్థాన్ రాయల్స్ గ్రౌండ్ కొట్టింది. ఆరు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన… రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించేందుకు మహేంద్రసింగ్ ధోని.. కాస్త ముందుగానే వచ్చాడు. అప్పటికే ఒక సిక్స్ అలాగే ఒక బౌండరీ బాదిన ధోని.. మ్యాచ్ ఎలాగైనా గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు.
Also Read: CSK VS RR: చివరలో అదరగొట్టిన సందీప్ శర్మ.. రాజస్థాన్ తొలి విజయం
కానీ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్ కు బోల్తా కొట్టాడు మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni ). చివరి ఓవర్ లో మొదటి బంతి వైడ్ కాగా.. రెండవ బంతి సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ తరుణంలోనే…. సిక్స్ గేట్ దగ్గర…హెట్ మేర్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని అవుట్ కాగానే…. స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. వాస్తవానికి గౌహతి స్టేడియం రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్.
కానీ అక్కడ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీలతో మెరిసింది. కానీ మహేంద్రసింగ్ ధోని అవుట్ కాగానే… స్టేడియంలో ఉన్న వారంతా ఇంటికి వెళ్లిపోయారు. అరిచి గోల చేసే వారంతా సైలెంట్ అయిపోయారు. ఇలాంటి నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్రసింగ్ ధోని అవుట్ కావడంపై ఓ లేడీ ఫ్యాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ధోని అవుట్ కాగానే చేతులు… పిసికేస్తూ.. వింత రియాక్షన్ ఇచ్చింది ఆ లేడీ ఫ్యాన్. ఆమెను చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోని డైహాడ్ ఫ్యాన్ అన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్ రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Chennai Super Kings vs Rajasthan Royals ) మధ్య నిన్న మ్యాచ్ జరుగగా ఇందులో రుతురాజు.. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి… 182 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్… ఫెయిల్ అయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆరు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మొదటి మ్యాచ్ లోనే ఫైన్ ?
A fan reaction when Dhoni got out #CSKvsRRpic.twitter.com/7upKiliFq5
— Sunil the Cricketer (@1sInto2s) March 30, 2025