OTT Movie : మళయాళ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాలను రియలిస్టిక్ గా తెరకెక్కిస్తుండటం వలన ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అయితే రీసెంట్ గా థియేటర్లలో సందడి చేసిన ఒక లవ్ స్టోరీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో ఒక యువకుడు తన తాత ప్రేమకథను గుర్తు చేసుకుంటూ, తన సొంత ప్రేమను ముందుకు నడిపిస్తాడు. ఈ స్టోరీ గతం, వర్తమానం మధ్య తిరుగుతూ ఒక ఫీల్ గుడ్ మూమెంట్ ను ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో ఉందంటే
‘శాంతమై రాత్రియిల్’ (Shanthamee Raathriyil) 2025లో విడుదలైన మలయాళ రొమాంటిక్ చిత్రం. ఈ సినిమా జయరాజ్ దర్శకత్వంలో రూపొందింది. 2025 మే 9న థియేటర్లలో విడుదలై, ఆగస్టు 22 నుండి మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఎస్తర్ అనిల్ (మీరా), కె.ఆర్. గోకుల్ (ఆర్యన్), సిద్ధార్థ్ భరతన్ (కృష్ణన్), మాలా పార్వతి (లీల) ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో ఈ సినిమా 5.6/10 రేటింగ్‌ను పొందింది. రొమాంటిక్, సినిమాటోగ్రఫీ అంశాలకు ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.
కథలోకి వెళ్తే
1970లలో మున్నార్‌లోని పొగమంచు కొండల్లో, ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ వద్ద, కృష్ణన్, లీల అనే ఒక యువ జంట సమాజాన్ని ఎదిరించి ప్రేమలో పడతారు. ఈ ప్రేమ, కులం సామాజిక ఒత్తిడుల వల్ల చిక్కుల్లో పడుతుంది. వీళ్ళు రహస్యంగా కలుసుకుంటూ తమ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒక రాత్రి జరిగే దుర్ఘటన వీళ్ళ ప్రేమను విషాదంలో ముంచెత్తుతుంది. కృష్ణన్ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది. ఈ కథనం ప్రజెంట్ లో ఒక రహస్యమైన డైరీ ద్వారా బయటికి వస్తుంది. ఈ డైరీని కృష్ణన్ మనవడు ఆర్యన్ 2024లో కనుగొంటాడు. ఈ డైరీ ఆర్యన్‌ను తన తాత గతంలోని రహస్యాలను తెలుసుకునేలా చేస్తుంది.
అదే సమయంలో అతను లండన్‌లో చదువుతూ ఉంటాడు. 2024లో ఆర్యన్ లండన్ బ్రిడ్జ్ వద్ద ఒక యువతి, మీరాను కలుస్తాడు. వారి మధ్య ఒక సున్నితమైన ప్రేమకథ మొదలవుతుంది. ఆర్యన్ తన తాత డైరీని చదువుతూ, కృష్ణన్, లీల విషాద ప్రేమకథతో తన సొంత జీవితంతో పోల్చుకుని గమనిస్తాడు. మీరాతో అతని సంబంధం బలపడుతున్న కొద్దీ, గతంతో ఊహించని విధంగా ముడిపడి ఉందని తెలుస్తుంది. 1970లలో మున్నార్‌లోని కృష్ణన్, లీల విషాద ప్రేమ, 2024లో ఆర్యన్, మీరా ప్రేమ సస్పెన్స్ తో కూడిన క్లైమాక్స్‌లో కలుస్తాయి. ఈ రెండు స్టోరీలకు ఉన్న లింక్ ఏమిటి ? కృష్ణన్ లవ్ స్టోరీ ఎందుకు విషాదంగా ముగిసింది ? ఆర్యన్ బయటికి తెచ్చే విషయాలు ఏమిటి ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళ రొమాంటిక్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : భర్త ఉండగానే మరొకడితో… వెంకటేష్ హీరోయిన్ ఇలాంటి రోల్ లో… ఫ్యామిలీతో చూడకూడని మూవీ