Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలోకి కాలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల మనసులో మంచి నటిగా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలతో బిజీ అయింది. అయితే ఎవరు ఊహించని విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడం ఇప్పటికీ సంచలనంగానే ఉంది. ఆ తర్వాత సమంత ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో సినిమాలకు దూరమైంది.. ఈమధ్య బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో నిర్మాతగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా సమంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పటివరకు నిర్మాతగా ఉన్న సమంత ఇక మీద నుంచి డైరెక్టర్ గా కనిపించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? లేదా? ఏదైనా సినిమా కోసమా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
లేడీ డైరెక్టర్ సమంత..
నటిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా, ఎంట్రప్రెన్యూర్ గా సమంత పలు రంగాల్లో రాణిస్తోంది. అయితే సమంత ఇప్పుడు ఇండస్ట్రీలో మరో కొత్త రోల్ ను ఎంచుకోబోతుందట. త్వరలోనే సమంత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గా మారనుందని ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. అయితే సమంత ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథను కూడా సిద్ధం చేసిందని సమాచారం. ఎప్పుడూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతోనే సమంత సినిమాలను తెరకెక్కించింది. నిర్మాతగా ఈమె చేసిన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు డైరెక్టర్ తన టాలెంట్ ను నిరూపించుకుంటుందో చూడాలి.
Also Read: అరేయ్.. మా వంటలక్కను ఏం చేస్తున్నారు..? మరీ దారుణం…
తన బ్యానర్ లోనే సినిమా..
సమంత హీరోయిన్గా బాగా సక్సెస్ అయింది. ఈమధ్య తన సొంత బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా కూడా మొదటి సినిమాతో సక్సెస్ ని సాధించింది. నిర్మించిన మొదటి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు డైరెక్టర్గా నిర్మాతగా తన సొంత బ్యానర్ లోనే సినిమాలను నిర్మించాలని అనుకుంటుందట. ప్రస్తుతం రక్త్ బ్రహాండ్, మా ఇంటి బంగారం సినిమాలు చేస్తున్న సమంత డైరెక్టర్ గా డెబ్యూ చేయాలన్నా ఇంకా స్టార్ టైం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా సమంత తన కెరీర్ ని పెళ్లి చేసుకోవడానికి వరుసగా కొత్త నిర్ణయాలను తీసుకుంటూ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నిర్మాతగా సక్సెస్ అయిన ఆమె డైరెక్టర్గా కూడా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఎక్కడ తగ్గకుండా సమంత ఒక్కో మెట్టు ఎదుగుతూ ముందుకు సాగుతుంది. ఈమె నిర్ణయాలకు అభిమానులు మద్దతిస్తున్నారు. ఇకముందు సినిమాలు చేస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది..