OTT Movie : పురాతన కాలంలో రాజులు, రాజ్యాలు, యుద్ధాలతో కొన్ని ప్రాంతాలు మునిగిపోయేవి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తిరుగుతుంది. రాణిగా చూసుకోవాల్సిన అమ్మాయిని బిచ్చగాళ్లకు బహుమతిగా ఇస్తాడు రాజు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఎన్నో మలుపులు తిరుగుతాయి. ఈ మూవీ కూడా చివరివరకూ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ ఫ్రెంచ్ మూవీ పేరు ‘షెహరజాదే’ (Sheharazade) . 1963 లో వచ్చిన ఈ ఫ్రెంచ్ సాహస మూవీకి పియరీ గాస్పార్డ్-హ్యూట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘వన్ థౌజండ్ అండ్ వన్ నైట్స’ కథల నుండి తీసుకుని తెరకెక్కించారు. ఇందులో అన్నా కరీనా షెహరజాదే పాత్రలో నటించింది. ఈ సినిమా 809 సంవత్సరంలో బాగ్దాద్‌లో జరుగుతుంది. ఇక్కడ కాలిఫ్ హరౌన్-అల్-రషీద్ పరిపాలన చేస్తుంటాడు. ఇందులో ఒక ఆధ్యాత్మిక యువతి, రాజు , సేనాపతిల ట్రాయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వీళ్ళ లవ్ స్టోరీలో చాలా మలుపులు ఉంటాయి. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
షెహరజాదే అనే ఒక అందమైన ఆధ్యాత్మిక యువతిని, కొంతమంది ఒక శక్తివంతమైన సుల్తాన్ కు బహుమతిగా ఇస్తారు. దీనికి బదులుగా వాళ్ళకి పవిత్ర ప్రదేశానికి స్వేచ్ఛగా వెళ్ళే అనుమతి లభిస్తుంది. అయితే ఆమెను సుల్తాన్ సహాయకుడైన రెనాడ్ డి విల్లెక్రోయిక్స్ ఒక ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఈ సంఘటన జరిగిన తరువాత షెహరజాదే, రెనాడ్‌పై ప్రేమలో పడుతుంది. ఇది చూసిన సుల్తాన్ ఇద్దరినీ బంధిస్తాడు. ఎందుకంటే ఆమెను కూడా సుల్తాన్ ఇష్టపడుతుంటాడు. ఆమెను రాణిని కూడా చేయాలనుకుంటాడు. తరువాత షెహరజాదే కు కొరడా దెబ్బలతో పాటు, తలను కూడా నరకమని ఆజ్ఞాపిస్తాడు. ఇంతలో అక్కడికి బిచ్చగాళ్లు వచ్చి ఆమెను బహుమతిగా అడుగుతారు. వాళ్ళ చట్టం ప్రకారం తప్పు చేసిన వాళ్ళని అలా ఇచ్చే అధికారం సుల్తాన్ కు ఉంటుంది. సుల్తాన్ ఆమెను వాళ్ళకు బహుమతిగా ఇస్తాడు.
వాళ్ళ నుంచి కొంతమంది రెనాడ్ అనుచరులు ఆమెను కాపాడతారు. సుల్తాన్ నుంచి తప్పించుకున్న రెనాడ్, షెహరజాదే ను కలుస్తాడు. వాలిద్దరూ వేరే ప్రాంతానికి వెళ్ళి, సంతోషంగా బ్రతకాలని నిర్ణయించుకుంటారు. చివరికి షెహరజాదే తన ప్రేమను ఎవరితో పంచుకుంటుందో తెలియాలి అనుకుంటే ఈ మూవీని చూడండి. ఈ మూవీ ప్రేమ, సాహసం, ఉత్కంఠతో నిండిన కథనంతో ముందుకు సాగుతుంది. షెహరజాదే, రెనాడ్ మధ్య ప్రేమ కథ, రాజకీయ కుట్రలు, యుద్ధ దృశ్యాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. అన్నా కరీనా అద్భుతమైన నటన, అందమైన దృశ్యాలు, రంగురంగుల దుస్తులు ఈ మూవీకి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ సినిమా ఫ్రాన్స్‌లో 1963 లో విడుదలైంది. అక్కడ 1963 లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది.