E-Paper
Advertisement

అల్లరి అసుర పిల్లల రచ్చ… కిడ్స్ తో కలిసి చూడాల్సిన మస్ట్ వాచ్ సిరీస్

అల్లరి అసుర పిల్లల రచ్చ… కిడ్స్ తో కలిసి చూడాల్సిన మస్ట్ వాచ్ సిరీస్
Advertisement

Animation Series: చిన్న పిల్లలు భరించలేనంత అల్లరి చేసినప్పుడు… ప్రతీ ఒక్కరూ అనుకునే మాటే వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు. అయితే చిన్నారులు అల్లరి చేస్తే ఎలా ఉంటుందో మనలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. కానీ అదే అసుర జాతి పిల్లలు చేసే చిలిపి పనులు ఎలా ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించారా ? ఊహకు కూడా అందని ఇదే అంశంతో తాజాగా ఓటీటీలోకి ఓ సిరీస్ అడుగు పెట్టింది. అదే ‘శివలోక్ కె కుండక్క మండక్క’ (Shivlok Ke Kundakka Mandakka). మరి ఈ అల్లరి అసుర పిల్లల చేసే సాహసాన్ని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కుండక్క, మండక్క అనే ఇద్దరు కొంటె, అల్లరి అసుర కవల పిల్లలు కథలో ముఖ్యమైన పాత్రలు. సాధారణంగా అసురులు అంటే భయం, విధ్వంసం అని భావిస్తాం. కానీ ఈ ఇద్దరు పిల్లలు ఆ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తారు. ఆ పిల్లలు ఒక మాయా గురుకులంలో చేరతారు. ఆ గురుకులం ఎన్నో పురాతన రహస్యాలు, వింత వింత జీవులు, మాయా లోకాలతో ఉంటుంది. అక్కడ టీచర్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటారు.

Advertisement

కుండక్క, మండక్క గురుకులంలో ఎన్నో కొంటె పనులు చేస్తారు. ఓసారైతే గురువుల మంత్రాలను తప్పుగా ఉచ్చరించి పెద్ద గందరగోళం సృష్టిస్తారు. మరొకసారి గురుకులంలోని రహస్యమైన గదుల్లోకి చొరబడి, వింత వింత వస్తువులను తాకి ప్రమాదాలు సృష్టిస్తారు. కానీ వీళ్ళు అల్లరి చేష్టలు చేసే పిల్లలు మాత్రమే కాదు, మంచి పిల్లలు అని కూడా అన్పించుకుంటారు. వారు తమ చుట్టూ ఉన్న ప్రమాదాలను ఫేస్ చేయడమే కాదు, స్నేహితులను కాపాడుకోవడానికి, మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారు.

ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే… అసురులను విలన్లుగా చూపించకుండా, వారిలోని మంచి గుణాలను, ధైర్యాన్ని హైలైట్ చేస్తూ నవ్విస్తారు. కుండక్క, మండక్క అల్లరిని పక్కన పెట్టి, మంచి గుణాలను నేర్చుకుంటూ హీరోలుగా ఎలా మారతారు ? ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొనే ఛాలెంజ్ లు ఏంటి ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

6 భాషల్లో స్ట్రీమింగ్ 

Advertisement

‘శివలోక్ కె కుండక్క మండక్క’ సిరీస్ ZEE5 KidZ Universeలో భాగంగా వచ్చింది. ఈ సిరీస్ పిల్లల మనసుకు నచ్చేలా రంగులు, సూపర్ యానిమేషన్ క్వాలిటీ, కామెడీతో సాగుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, బెంగాలీ సహా 6 భాషల్లో అందుబాటులో ఉంది. కాబట్టి భారతదేశంలోని అన్ని ప్రాంతాల పిల్లలు హ్యాపీగా తమకు నచ్చిన భాషలో సిరీస్ ను చూసి ఎంజాయ్ చేయవచ్చు. అయితే పిల్లలు ఎప్పుడూ ఆసక్తిగా వింటూ, చూస్తూ ఉండే కథలు పౌరాణిక కథలు. అందులో రాక్షసులే విలన్లు. కానీ ఈసారి మాత్రం కథ మారుతుంది. ఈ సరికొత్త యానిమేటెడ్ సిరీస్ జూలై 17 స్ట్రీమింగ్ అవుతుంది. పిల్లలు, కుటుంబ సభ్యులందరికీ ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన పిల్లల పుస్తకం ‘ది వెరీ, ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ఆధారంగా రూపొందింది.

Read Also: మర్మమైన రీతిలో గ్రామస్తుల మరణాలు… దున్నపోతును బలిస్తేనే శాంతించే శాపం

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×