BigTV English

OTT Movie : కొత్త ఇంట్లో పాత దయ్యం… మంత్రాలు రాని మంత్రగాడు… బొమ్మలో అసలు రహస్యం…

OTT Movie : కొత్త ఇంట్లో పాత దయ్యం… మంత్రాలు రాని మంత్రగాడు… బొమ్మలో అసలు రహస్యం…

OTT Movie : హారర్ సినిమాల ప్రేక్షకులను ఎక్కువగా భయపెడుతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు కామెడీతో ఎంటర్టైన్ చేస్తుంటాయి. హారర్ సినిమాలకి కామెడీని జత చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. ఇదివరకే ఇటువంటి సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో దయ్యం ఉందని తెలియక ఒక వ్యక్తి ఇంటిని కొంటాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగే ఫన్నీ సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘షో మీ ద ఘోస్ట్’  (Show me the ghost).  2021లో విడుదలైన ఈ కొరియన్ కామెడీ హారర్ మూవీకి కిమ్ యున్క్యోంగ్ దర్శకత్వం వహించారు. హాన్ స్యూంగ్-యెన్, కిమ్ హ్యూన్-మోక్, హాంగ్ సీయుంగ్-బమ్ ఇందులో నటించారు. ఇది జూలై 10న 25వ బుచియోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇద్దరు స్నేహితుల మధ్య ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. సెప్టెంబర్ 9, 2021న థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ కొత్త ఇంటిని కొంటాడు. హీరోకి ఇతని హీరోయిన్ కొంత డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటుంది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతనికి చెప్తుంది. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని, నేను ఈ మధ్యనే ఒక ఇల్లు కొన్నానని చెప్తాడు.  హీరోయిన్ కి కూడా ఉద్యోగం లేకపోవడంతో అతని ఇంటికి వెళుతుంది. వీళ్ళిద్దరూ ఇదివరకే ఫ్రెండ్స్ కావడంతో, అలా వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. మరోవైపు ఈ ఇంటికి ఎదురుగా ఒక కుర్రాడు వీళ్లను అదేపనిగా చూస్తూ ఉంటాడు. ఎవరో పిచ్చోడేమో అనుకుంటూ వీళ్లు లైట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ ఇంట్లో దయ్యాల గోల స్టార్ట్ అవుతుంది. ఒక ఆత్మ వీళ్ళని బాగా భయపడుతూ ఉంటుంది. ఆ ఆత్మ వీళ్లకు ఒక బొమ్మని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వీళ్లకు అప్పుడు అర్థమవుతుంది ఈ ఇంట్లో ఆత్మలో ఉన్నందువల్లే, ఓనర్ ఇంటిని అమ్మేశాడని అనుకుంటారు.

అయితే వాళ్ల దగ్గరికి వెళ్లి ఇంటిని తిరిగి తీసుకోమని చెప్తారు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అగ్రిమెంట్ చూపించి కుదరదని చెప్తాడు. అలా మళ్లీ ఇంటికి వచ్చి ఒక మంత్రగాన్ని తీసుకొస్తారు. వాడికి మంత్రాలు కాదు కదా, చిన్న పిల్లల సాంగ్స్ కూడా రావు. దయ్యం వచ్చేసరికి వాడికి తడిసిపోతుంది. ఈ క్రమంలోనే దయ్యం ఇవ్వాలనుకున్న బొమ్మలో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాలో చూస్తే, ఇదివరకే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. తనని ఎదురుగా ఇంట్లో ఉన్న వ్యక్తి మనసికంగా హింసిస్తాడు. తన గదిలో కెమెరాలు పెట్టి వీడియోలు కూడా తీస్తాడు.  ఆ భయంతోనే ఆ ఇంట్లో అమ్మాయి చనిపోయి ఉంటుంది. చివరికి దయ్యం రివేంజ్ తీర్చుకుంటుందా? దెయ్యానికి హీరో హెల్ప్ చేస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×