E-Paper
Advertisement

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రద్ధాదాస్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రద్ధాదాస్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Tollywood: థియేటర్లలో సందడి చేసే ప్రతి సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా థియేటర్లలో సినిమా చూడడం మిస్సయిన ఆడియన్స్ ఓటీటీలో ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి వీక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి మరో సైకలాజికల్ హారర్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫారం వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన శ్రద్ధాదాస్ త్రికాల..

ప్రముఖ హీరోయిన్ శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్ర ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ త్రికాల: స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’.. మే 28వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో భారీ తారాగణం లేకపోవడం వల్లే ఆడియన్స్ కూడా ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు సడన్గా సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. ముందస్తు ప్రకటన ఏమాత్రం లేకుండా కేవలం ఒకరోజు ముందుగా మాత్రమే జూలై 9 నుంచి సన్ నెక్స్ట్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్స్ ఇచ్చేశారు. ఇక నేడు సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

Advertisement

also read:మెగా 158 కోసం చిరు హైరిస్క్.. నడవలేని స్థితిలో!

త్రికాల సినిమా స్టోరీ..

త్రికాల సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కొన్ని సంవత్సరాలుగా శాపగ్రస్తులైన రాజ కుటుంబంలో పుట్టిన వైతరణ్ (అజయ్) సైకలాజికల్ బై పోలార్ డిసార్డర్ సమస్యతో పుడతాడు. ఇతడికి చీకటిలో తప్ప సూర్యుడు వెలుగు చూడలేని పరిస్థితి. అయితే వైతరణ్ ను బాల్యంలోనే తల్లి మరణించడంతో సవతి తల్లి ఆమని పెంచి పోషిస్తూ ఉంటుంది. మరోవైపు తప్పిపోయిన తన ప్రేయసి నిధి (సాహితి) నీ వెతుక్కుంటూ శివ (మాస్టర్ మహేంద్రన్) నగరానికి వచ్చి వైతరణ్ గురించి తెలుసుకుంటాడు. వైతరణ్ వ్యాధిని నయం చేసేందుకు సైక్రియాటిస్ట్ మాయ (శ్రద్ధదాస్) వస్తుంది. కానీ తన తల్లిని హత్య చేసి వైతరణ్ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పురాతన భవనంలోనే వైతరణ్ ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. వైతరణ్ కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన సవతి తల్లిని ఎందుకు హత్య చేశాడు? వైతరణ్ కుటుంబానికి ఉన్న శాపం ఏమిటి ? ప్రాచీన సాంకేతిక రహస్యాలు అసురుల చేతిలో పడకుండా ఏం చేశారు? ఆ భవనంలోకి వచ్చిన సైక్రియాటిస్ట్ మాయా కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అదృశ్యమైన నిధి ఆచూకీ శివకు లభించిందా ? త్రికాలను ఎవరు మేల్కొల్పారు? ఇలా పలు ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే త్రికాల సినిమా చూడాల్సిందే. ఇకపోతే ట్రైలర్ రిలీజ్ చేసిన సమయంలో కాటేరమ్మకు కోపం వచ్చింది? ముడుపు కట్టి కోరిక కోరితే మరణమే అనే డైలాగు విపరీతంగా ఆకట్టుకుంది. పైగా తోడేళ్ల పోరులో నెగ్గేదెవరు అనే కాన్సెప్ట్ కూడా ఆకట్టుకుంది. మరి ట్రైలర్ తో అంచనాలు పెంచిన యూనిట్ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇలాంటి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×