E-Paper
Advertisement

అయ్యబాబోయ్ ఇదేం అరాచకం… చీమల్లా దూరి చికాకు పెట్టే చిట్టి మనుషులు

అయ్యబాబోయ్ ఇదేం అరాచకం… చీమల్లా దూరి చికాకు పెట్టే చిట్టి మనుషులు
Advertisement

Sci Fi Action Movie: సోల్జర్స్ అంటే ఎలా ఉంటారు ? మంచి ఫిజిక్ తో, చేతిలో గన్ పట్టుకుని, చూడగానే సెల్యూట్ చేయాలి అనిపించేలా ఉంటారు. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం సైనికులు బుల్లి బుల్లి బొమ్మల రూపంలో ఉంటారు. చిట్టి చీమల్లా మనుషుల పైకి ఎగబాకి, వాళ్ళను కట్టిపడేస్తారు. ఇంత వింత కథతో తెరకెక్కిన ఆ విచిత్రమైన సినిమా పేరే ‘స్మాల్ సోల్జర్స్’ (Small Soldiers). ఈ సినిమా ఇప్పటిది కాదు, 1998లో విడుదలైంది మూవీ. చిన్న బొమ్మలు… భయంకరమైన యుద్ధం వంటి అంశాల ఆధారంగా రూపొందిన ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కథలోకి ఒక చిన్న పట్టణంలోని అలాన్ అబెర్నాతి అనే టీనేజ్ కుర్రాడి జీవితంతో సినిమా షురూ అవుతుంది. అతని తండ్రి బొమ్మల షాపు నడుపుతాడు. ఒకరోజు ‘గ్లోబోటెక్’ అనే పెద్ద మిలిటరీ టెక్నాలజీ కంపెనీ, ఒక బొమ్మల కంపెనీని కొంటారు. తమ అధునాతన ‘X-1000’ మైక్రోప్రాసెసర్ చిప్‌లను రహస్యంగా బొమ్మలలో అమర్చుతుంది. ఈ చిప్‌లు బొమ్మలకు స్వంత తెలివి, భావాలు, యుద్ధ వ్యూహాలు గురించి జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ చిప్‌ల వల్ల రెండు రకాల బొమ్మలు జీవం పోసుకుంటాయి.

Advertisement

ఒకటి కమాండో ఎలైట్… మేజర్ చిప్ హజార్డ్ నాయకత్వంలో క్రూరంగా ప్రవర్తించే మిలిటరీ బొమ్మల సైన్యం. రెండవది గోర్గోనైట్స్… చూడటానికి వింత రాక్షసుల్లా కనిపించినప్పటికీ, ఆర్చర్ నాయకత్వంలో చాలా శాంతియుతంగా ఉండే మంచి బొమ్మలు. కమాండో బొమ్మలకు గోర్గోనైట్స్‌ను పూర్తిగా నాశనం చేయాలనే ప్రోగ్రామింగ్ ఉంటుంది. అలాన్ తన షాపులో ఈ కొత్త బొమ్మల స్టాక్‌ను డెలివరీ తీసుకున్న తర్వాత, బాక్సుల్లో ఉన్నప్పుడే చిప్‌లు యాక్టివేట్ అయి బొమ్మలన్నీ మనుషుల్లా లేచి వస్తాయి. కమాండో ఎలైట్ సైన్యం గోర్గోనైట్స్‌ను వేటాడటం స్టార్ట్ చేస్తుంది.

ఆర్చర్ అనే మంచి బొమ్మ అలాన్ ఇంట్లో దాక్కుంటుంది. అలాన్, అతని క్లాస్‌మేట్ క్రిస్టి లీ సహాయంతో ఆర్చర్‌ను కాపాడడానికి ప్రయత్నిస్తారు. కానీ కమాండో బొమ్మల లీడర్ చిప్ హజార్డ్ చాలా క్రూరంగా ఆలోచిస్తుంది, ఎంత దారుణంగా అంటే తమకు అడ్డొస్తున్న అలాన్ కుటుంబాన్ని, క్రిస్టి కుటుంబాన్ని బందీలుగా మార్చడానికి ప్లాన్ చేస్తుంది. ఇంట్లో ఉన్న ఇతర సాధారణ వస్తువులను, అమ్మాయిల బార్బీ డాల్స్‌ను కూడా ప్రమాదకరమైన ఆయుధాలుగా మారుస్తాడు. అలాన్ ఇంటిపై పూర్తి స్థాయిలో సైనిక దాడి చేస్తాయి. బొమ్మల యుద్ధం ఇంటి గదులు, కిచెన్, గ్యారేజ్ అంతటా వ్యాపిస్తుంది. చివరికి అలాన్ కుటుంబం ఆ యుద్ధాన్ని ఎలా ఆపింది ? అలాన్ కుటుంబం, క్రిస్టి కుటుంబం తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు? సినిమా చివర్లో వచ్చే ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్‌ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగు స్ట్రీమింగ్

Advertisement

‘స్మాల్ సోల్జర్స్’ సినిమా చూస్తే… టెక్నాలజీ మనుషుల చేతుల్లో ఎంత ప్రమాదకరంగా మారవచ్చు అనేది తెలుస్తుంది. గ్రెగోరీ స్మిత్, కిర్‌స్టన్ డన్స్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హాలీవుడ్ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్-కామెడీ చిత్రం చిత్రానికి జో దాంతే దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యూత్, పిల్లలు ఇప్పటికీ ఈ సినిమా అంటే తెగ ఇష్టపడతారు. ప్రస్తుతం Netflix, Amazon Prime Videoలో ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లో మాత్రం లేదు.

Read Also: 40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×