OTT Movie : ఒక బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ అయింది. మనాలి అద్భుతమైన లొకేషన్స్, క్లైమాక్స్ లో వచ్చే హై-స్టేక్స్ ఛేజ్ సీన్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. చివరివరకు ఉత్కంఠభరితంగా నడిచే ఈ సినిమా, ఈ నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
రియా అనే యువతి షిమ్లా నుండి మనాలికి ప్రయాణిస్తూ అదృశ్యమవుతుంది. ఆమె సోదరి మౌష్మి భయాందోళనతో మనాలి పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తుకొస్తుంది. ఇన్‌స్పెక్టర్ సుమన్ నేగి, ఇన్‌స్పెక్టర్ దేవ్ సహాయం కోరుతుంది. పోలీసులు రియా ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. ఆమె చివరిగా కనిపించిన టాక్సీ డ్రైవర్ కుల్దీప్ పై అనుమానం పడతారు. కుల్దీప్‌ను విచారించగా, రియా ఒక అడవిలో బందీగా ఉందని, ఆమె బ్లడీడ్‌గా భయంతో తప్పించుకుని పారిపోయిందని తెలుస్తుంది. అయితే ఇది సాధారణ కిడ్నాపింగ్ కాదని, రియా గతం, ఆమె పాత్ర గురించి షాకింగ్ సీక్రెట్స్ బయటపడతాయి. సుమన్, దేవ్ దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ, రియా నిజంగా బాధితురాలా లేక వేరే ఏదైనా రహస్యం ఉందా అనే సందేహాలు తలెత్తుతాయి. ఈ క్రమంలో అడవిలో రెండు ఫోన్‌ల సిగ్నల్స్ ఒకే చోట నుండి వస్తున్నాయాని తెలుసుకుంటారు. అక్కడ ఏదో ప్రమాదకరమైన సంఘటన జరిగిందని పోలీసులు గ్రహిస్తారు.
దర్యాప్తు మరింత హై టెన్షన్ క్రియేట్ చేస్తుంది. రియాను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆమెను మళ్లీ పట్టుకోవడానికి ఆయుధాలతో వెంటాడుతున్నాడని తెలుస్తుంది. సుమన్ నేగి తన తెలివితో, కుల్దీప్‌ను ఇంటరాగేట్ చేస్తూ, కేసు వెనుక దాగిన పెద్ద కుట్రను బయటపెడుతుంది. ఈ కుట్రలో రియా గురించి అనుకోని ట్విస్ట్‌లు, ఆమెను కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి ఆధారాలు బయటపడతాయి. క్లైమాక్స్‌లో రియాను కాపాడడానికి సుమన్, దేవ్ ఒక “హై-స్టేక్స్ ఛేజ్” చేస్తారు. ఈ ఛేజింగ్ లో రియాను పోలీసులు కాపాడతారా ? ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు ? ఎందుకు చేశారు ? ఇందులో టాక్సీ డ్రైవర్ కుల్దీప్ పాత్ర ఎంత ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
‘So Long Valley’ 2025లో విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. మాన్ సింగ్ దర్శకత్వంలో, త్రిధా చౌదరి (ఇన్‌స్పెక్టర్ సుమన్ నేగి), అకాంక్షా పూరి (రియా), విక్రమ్ కొచ్చర్ (కుల్దీప్), మాన్ సింగ్ (ఇన్‌స్పెక్టర్ దేవ్), అలీషా పర్వీన్ (మౌష్మి) ప్రధాన పాత్రల్లో నటించారు. సౌర్య స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ పట్నాయక్ సినిమాటోగ్రఫీ, LK లక్ష్మీకాంత్ సంగీతం అందించారు. ఇది 2025 జూలై 25న థియేటర్లలో విడుదలై, పొజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా 2 గంటల 4 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 7.3/10 రేటింగ్ పొందింది.
Read Also : రెంటుకొచ్చిన అమ్మాయితో రెచ్చిపోయే ఓనర్… అర్ధరాత్రి వింత శబ్దాలు… వణుకు పుట్టించే సైకో సీన్స్