Yash vs Ranbir Kapoor : కొన్ని సినిమాలను కొందరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు విపరీతమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. అలాంటి ప్రాజెక్టులో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం ఒకటి. రన్బీర్ కపూర్ రాముడిగా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. సాయి పల్లవి సీత పాత్రలో కనిపిస్తుంది. అయితే ఈ సినిమాల్లో రావణుడు పాత్రను కన్నడ స్టార్ హీరో యష్ చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వీడియో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఈ వీడియో వచ్చిన తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ను మళ్ళీ ట్రోల్ చేశారు చాలామంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే బాక్స్ ఆఫీస్ వద్ద రన్బీర్ కపూర్ కు యష్ మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ జరగనుంది. వీరిద్దరూ నటిస్తున్న వేర్వేరు సినిమాలు ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద విడుదల కానున్నాయి. ఇద్దరు కూడా అసలు వెనక్కు తగ్గడం లేదు.
యష్ (Yash) నటిస్తున్న టాక్సిక్ సినిమా పిరియాడిక్ గ్యాంగ్స్టర్ జోనర్ లో వస్తుంది. ఈ సినిమాకు గీతు మోహన్ దాస్ (Geethu Mohandas) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార (Nayanthara), కియారా అద్వానీ (kiyara Advani), రుక్మిణి వసంత్ (Rukmini Vasant) ఇలా చాలామంది నటిస్తున్నారు. అలానే టోవినో థామస్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాను మార్చి 19వ తారీఖున 2026 లో విడుదల చేయనున్నారు. దీని గురించి చిత్ర యూనిట్ కూడా అధికారికంగానే ప్రకటించారు.
సంజలీల బన్సలీ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) మరియు ఆలియా భట్ (Alia Bhatt) నటిస్తున్న సినిమా లవ్ అండ్ వార్. ఈ సినిమాలో విక్కీ కౌశల్ (Vicky Kaushal) కూడా నటిస్తున్నాడు. సంజలీల బన్సాలి (Sanjay Leela Bhansali) సినిమా అంటే గ్రాండ్ స్కేల్లో ఉంటుంది. ఆ సినిమా గురించి కూడా క్యూరియాసిటీతో ఎదురుచూసే ఆడియన్స్ ఉన్నారు. ఈ సినిమాను మార్చి 20వ తారీఖున 2026 లో విడుదల చేయనున్నారు. దీనిని కూడా చిత్ర యూనిట్ అధికారికంగానే ప్రకటించారు.
మామూలుగా రామాయన్ (Ramayan) సినిమాలు రాముడు మరియు రావణాసురుడికి మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. దానిని నితీష్ తివారి (Nitish Tiwari) చూపిస్తాడు. కానీ ఆ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ రెండు సినిమాలు వేర్వేరుగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఇది రియల్ ఫైట్. ఇక్కడ విజేతను సినిమా కలెక్షన్లు తేలుస్తాయి.
Also Read: Siva Karthikeyan : మదరాసి మూవీలో యంగ్ టైగర్ గెస్ట్ రోల్… ఓపెన్‌గా చెప్పేసిన హీరో