BigTV English

Vijayawada News: డ్యూటీలో ఉండగానే మద్యం సేవించి గొడవకు దిగిన కానిస్టేబుళ్లు.. యువతితో అసభ్య ప్రవర్తన..!

Vijayawada News: డ్యూటీలో ఉండగానే మద్యం సేవించి గొడవకు దిగిన కానిస్టేబుళ్లు.. యువతితో అసభ్య ప్రవర్తన..!

Vijayawada News: బాధ్యతగా డ్యూటీ నిర్వహించాల్సిన ఇద్దరు కానిస్టేబుల్ ఉద్యోగులు నడి రోడ్డుపై దారుణంగా ప్రవర్తించారు. డ్యూటీలో ఉండగానే మద్యం సేవించి గొడవకు దిగడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.  విజయవాడ నగరంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వివాదాస్పద చర్యలకు పాల్పడడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటన పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


విజయవాడ ఫోర్త్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ డ్యూటీలో ఉండగానే మద్యం సేవించాడు. తాగిన మత్తులో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి గొడవకు దిగాడు. యూనిఫాంలో ఉండగానే మద్యం సేవించినట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. యువతి, శ్రీనివాస్ నాయక్ గొడవ పడుతుండగా.. వీరిద్దరి మధ్యలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు జోక్యం చేసుకున్నాడు. దీంతో ఇద్దరి కానిస్టేబుళ్ల మధ్య గొడవ జరిగింది. నడి రోడ్డు పైనే అందరూ చూస్తుండగానే శ్రీనివాస్ నాయక్, కోటేశ్వర రావు చొక్కాలు పట్టుకుని గొడవకు దిగారు. ఈ యువతి కానిస్టేబుల్ ను నానా బూతులు కూడా తిట్టింది.

ఈ విషయం కాస్త కమిషనర్ రాజశేఖర్ బాబు వద్దకు చేరింది. కానిస్టేబుల్స్ శ్రీనివాస్ నాయక్, కోటేశ్వర్ రావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అనంతరం కమిషనర్ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాడు. అయితే ఆ ఇద్దరి కానిస్టేబుళ్లను ఒకరిని మాత్రమే సస్పెండ్ చేయాల్సింది అని జనాలు చెబుతున్నారు. కోటేశ్వరరావు గొడవ ఆపేందుకు వెళ్తే అతడిపై కూడా వేటు పడిందని స్థానికులు తెలిపారు.

ALSO READ: LIC HFL: డిగ్రీ అర్హతతో అప్రెంటీస్ పోస్టులు.. నెలకు రూ.12,000 స్టైఫండ్, దరఖాస్తుకు చివరితేది ఇదే..

ఈ ఘటనపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి అనుచిత ప్రవర్తనలో పాల్గొనడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖలో సంస్కరణలు అవసరమని, క్రమశిక్షణ చర్యలు మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.

ALSO READ: Paramedical Staff Jobs: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 5 రోజులే గడువు

Related News

Shyamala Harati: శ్యామల-హారతి.. పాట పాడి మరీ ట్రోల్ చేసిన కిరాక్ ఆర్పీ

Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటలు జాగ్రత్త, ఈ జిల్లాల్లో?

Amaravati Capital: అమరావతిపై వైసీపీ సెల్ఫ్ గోల్.. మరింత స్పీడ్ పెంచిన కూటమి ప్రభుత్వం

Lokesh Tweet: తల్లిని పట్టించుకోని జగన్! నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్

Vizag Development: రుషికొండ బిల్డింగ్ వర్సెస్ విశాఖ గాజు వంతెన.. ఏది గొప్ప? ఎందులో గొప్ప?

Big Stories

×