OTT Movie : సీరియల్ కిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలు సరికొత్త కంటెంట్ తో వస్తున్నాయి. ఈ సినిమాలు ప్రతిక్షణం ఉత్కంఠంగా నడుస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సీరియల్ కిల్లర్ కథలో సూపర్‌నాచురల్ అంశాలు హైలెట్ గా ఉంటాయి. ఇందులో కిల్లర్ నొప్పిలేకుండా హత్యలు చేస్తుంటాడు. దీనిని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో షాకింగ్ ట్విస్లు వస్తాయి. సైకిక్ థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడేవాళ్లు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘సోలస్’ (Solace). దీనికి ఆఫోన్సో పోయార్ట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆంథోనీ హాప్‌కిన్స్ (డాక్టర్ జాన్ క్లాన్సీగా), జెఫ్రీ డీన్ మోర్గాన్ (FBI ఏజెంట్ జో మెర్రివెదర్‌గా), అబ్బీ కార్నిష్ (FBI ఏజెంట్ కేథరీన్ కౌల్స్‌గా), కోలిన్ ఫారెల్ (చార్లెస్ ఆంబ్రోస్‌గా) నటించారు. ఈ సినిమా ఒక సైకిక్ డాక్టర్, FBI ఏజెంట్లు కలిసి ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలతో నడుస్తుంది. ఈ సినిమా Amazon Prime Video, Apple TVలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. 1 గంట 41 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.4/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఒక నగరంలో ఒక సీరియల్ కిల్లర్ అత్యంత విచిత్రమైన పద్ధతులతో హత్యలు చేస్తుంటాడు. అయితే బాధితులు కూర్చున్న స్థితిలో మెడ వెనుక భాగంలో గుచ్చడం ద్వారా చనిపోతుంటారు. ఈ హత్యలను ఛేదించడానికి FBI ఏజెంట్ జో, ఒక క్రిమినల్ సైకాలజిస్ట్ కేథరీన్ కౌల్స్ కలసి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో ఆలోచనలో పడతారు. చనిపోయిన వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధాలు కూడా ఉండవు. ఈ నేపథ్యంలో జో తన పాత స్నేహితుడు రిటైర్డ్ డాక్టర్ అయినటువంటి జాన్ క్లాన్సీ సహాయం కోరుతాడు. జాన్ క్లాన్సీ ఒక సైకిక్. అంతేకాకుండా అతనికి భవిష్యత్తును చూడగల సామర్థ్యం ఉంటుంది. కానీ రెండు సంవత్సరాల క్రితం తన కూతురు మరణం, ఆ తర్వాత భార్యతో విడిపోవడం వల్ల జాన్ ఒంటరిగా జీవిస్తుంటాడు. మొదట అతను ఈ కేసులో చేరడానికి ఇష్టపడడు. కానీ కేథరీన్ మరణం గురించి ఒక భయంకరమైన విజన్ చూసిన తర్వాత, అతను కేసులో చేరతాడు.
Read Also : వెంటాడి వేటాడి లేసేపే ఆత్మ… ఒక్కసారి ఆ వీడియో చూశారంటే వదలదు… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ
జాన్ తన సైకిక్ అనుభవంతో వెంటనే కొన్ని విషయాలను తెలుసుకుంటాడు. కథ ముందుకు సాగుతున్నప్పుడు, హంతకుడు చార్లెస్ ఆంబ్రోస్ అని తెలుస్తుంది. అతను కూడా జాన్ కంటే శక్తివంతమైన సైకిక్ సామర్థ్యాలు కలిగి ఉంటాడు. ఆంబ్రోస్ హత్యల వెనుక ఒక విచిత్రమైన ఉద్దేశం ఉంటుంది. అతను చంపాలనుకునే వాళ్ళను “మెర్సీ కిల్లింగ్” (కరుణా హత్య) చేస్తుంటాడు. అంటే వీళ్ళను నొప్పి లేకుండా చంపుతుంటాడు. ఆంబ్రోస్ తన చర్యలను గొప్పవిగా భావిస్తాడు. ఎందుకంటే అతను వారికి బాధ నుండి విముక్తి కల్పిస్తున్నాడని నమ్ముతాడు. ఇక ఆంబ్రోస్, జాన్ మధ్య ఒక మానసిక “క్యాట్-అండ్-మౌస్” గేమ్ మొదలవుతుంది. ఇక్కడ ఇద్దరూ ఒకరి చర్యలను ఒకరు అంచనా వేయగలుగుతారు. చివరిగా క్లైమాక్స్ ఉత్కంఠంగా నడుస్తుంది. ఆంబ్రోస్ ఎందుకు హత్యలు చేస్తుంటాడు ? జాన్ అతన్ని పట్టుకుంటాడా ? క్లైమాక్స్ ట్విస్టులు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.