BigTV English

OTT Movie : వెంటాడి వేటాడి లేసేపే ఆత్మ… ఒక్కసారి ఆ వీడియో చూశారంటే వదలదు… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : వెంటాడి వేటాడి లేసేపే ఆత్మ… ఒక్కసారి ఆ వీడియో చూశారంటే వదలదు… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే ఎంటరైన్మెంట్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలు ట్విస్టులతో స్టోరీని చివరివరకు కన్ఫ్యుస్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫిలిప్పీన్ సినిమా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో గుండెల్లో దఢ పుట్టిస్తోంది. ఈ సినిమా సోషల్ మీడియా కంటెంట్ మోడరేషన్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఎన్ని అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఫిలిప్పీన్స్‌లో ఈసినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. ఈ సినిమాపేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఏ ఓటీటీలో ఉందంటే

‘డిలీటర్’ (Deleter) 2022లో విడుదలైన ఫిలిప్పీన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా. దీనికి మిఖాయిల్ రెడ్ దర్శకత్వం వహించారు. వివా ఫిల్మ్స్ బ్యానర్‌లో వివియన్ వెలెజ్ డెల్ రొసారియో నిర్మించిన ఈ చిత్రంలో నాడిన్ లస్ట్రే, లూయిస్ డెలోస్ రేయెస్, మెక్కాయ్ డి లియోన్, జెఫ్రీ హిడాల్గో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 డిసెంబర్ 25న మెట్రో మనీలా ఫిల్మ్ ఫెస్టివల్‌లో థియేటర్లలో విడుదలై, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సౌండ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఎడిటింగ్‌తో సహా 7 అవార్డులను గెలుచుకుంది. జపనీస్ హారర్ చిత్రాలైన ‘రింగ్’ ‘పల్స్’ నుండి ఇది ప్రేరణ పొందింది. ఇది IMDbలో 5.2/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

లైరా మనీలాలోని ఒక ఆన్‌లైన్ కంటెంట్ మోడరేషన్ కంపెనీలో “డిలీటర్”గా పనిచేస్తుంటుంది. ఆమె ఉద్యోగం సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ల నుండి హింసాత్మక, డిస్టర్బింగ్ కంటెంట్‌ను రివ్యూ చేసి, డిలీట్ చేయడం. ఈ పని ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, ఆందోళన, భయంతో ఆమె జీవితం ఒత్తిడితో నిండిపోతుంది. ఆమె సహోద్యోగి ఐలీన్ కూడా ఇదే ఒత్తిడిని ఎదుర్కొంటూ, లైరాకి స్నేహితురాలిగా ఉంటుంది. వారి బాస్ సైమన్ కఠినమైన నియమాలతో కంపెనీని నడిపిస్తుంటాడు. జాస్ అనే సహోద్యోగి లైరాతో చనువుగా ఉంటాడు. ఆమెకు ధైర్యం చెప్తూ సప్పోర్ట్ గా నిలుస్తాడు. ఈ క్రమంలో లైరా ఒక భయంకరమైన వీడియోను రివ్యూ చేస్తుంది. అది ఆమెను కలవరపెడుతుది. ఈ వీడియోలో “ది డిలీటర్” అనే ఒక మిస్టీరియస్ ఫిగర్ ఉంటుంది.

ఈ వీడియోను డిలీట్ చేయడం ద్వారా, లైరా అనుకోకుండా ఒక అతీంద్రియ శక్తి బారిన పడుతుంది. ఈ శక్తి ఆమె చూసిన గ్రాఫిక్ కంటెంట్‌తో ముడిపడి ఉందని, ఆమె జీవితంలో భయంకరమైన సంఘటనలను ట్రిగ్గర్ చేస్తుందని తెలుస్తుంది. ఈ శక్తి లైరాను కంప్యూటర్ స్క్రీన్‌ల ద్వారా, ఫోన్‌ల ద్వారా, CCTV కెమెరాల ద్వారా వెంబడిస్తుంది. ఆమెను మానసికంగా బాధపెడుతూ, ఆమె జీవితాన్ని గందరగోళంలో పడేస్తుంది. ఇదే సమయంలో ఐలీన్ కూడా ఈ ఉద్యోగం కారణంగా తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఆమె ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఇది లైరాకు మరింత భయాందోళనను కలిగిస్తుంది.

Read Also : పరిచయం లేని అబ్బాయితో ఆ పని.. భర్తనే మరో మగాడు కావాలని అడిగే అమ్మాయి… మైండ్ బ్లాక్ ట్విస్టులు

లైరా తన సహోద్యోగి జాస్ సహాయంతో, ఈ అతీంద్రియ శక్తి మూలాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో ఆమె కంపెనీలోని కొన్ని రహస్యాలను, సైమన్ దురుద్దేశాలు తెలుసుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో, లైరా తన గతంలోని ఒక బాధాకరమైన సంఘటనను ఎదుర్కొంటూ, “ది డిలీటర్” శక్తితో పోరాడాల్సి వస్తుంది. ఈ శక్తి ఆమె చూసిన గ్రాఫిక్ కంటెంట్‌లోని బాధితుల ఆత్మలతో ముడిపడి ఉందని, ఆమెను ఒక ప్రతీకార లూప్‌లో చిక్కుకునేలా చేస్తుందని తెలుస్తుంది. లైరా ఈ శక్తిని ఎదుర్కోవాలా ? లేక దానికి లొంగిపోవాలా ? అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? సైమన్ దాచిన సీక్రెట్స్ ఏమిటి ? ఆత్మలు ఎందుకు ఆమెను వెంబడిస్తున్నాయి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

AA22 OTT : బన్నీ – అట్లీ మూవీ ఓటీటీ డీల్… ఇండియాలోనే హైయెస్ట్ ధరకు సోల్డ్ అవుట్ ?

OTT Movie : చిన్న పిల్లలపై చెయ్యేస్తే ఈ సైకో చేతిలో మూడినట్టే… ఇలాంటి సైకోలు కూడా ఉంటారా భయ్యా

OTT Movie : అక్కా చెల్లెల్లు ఇద్దరూ ఒక్కడితోనే… లాస్ట్ కి కేక పెట్టించే కిర్రాక్ ట్విస్ట్

OTT Movie : ఊర్లో ఒక్కరిని కూడా వదలని దొర… పెళ్లి కాకుండానే అలాంటి పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : భార్య బట్టలు మార్చుకుంటుండగా పాడు పని… అనుమానపు భర్త అరాచకం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : తెగిపడే ఆడవాళ్ళ తలలు… క్వశ్చన్ మార్క్ కిల్లర్ బ్రూటల్ హత్యలు… ట్విస్టులతో మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

OTT Movie : మనిషి మాంసం, రక్తం కోసం తహతహలాడే రాక్షస జీవులు… బ్లడీ బ్లడ్ బాత్… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్

OTT Movie : మరో అమ్మాయితో భర్త ప్రైవేట్ వీడియో లీక్… డర్టీ పొలిటికల్ గేమ్ లో ఫ్యామిలీ బలి… ఇంటెన్స్ కోర్టు రూమ్ డ్రామా

Big Stories

×