OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను యూత్ కళ్ళు పెద్దవిచేసుకుని చూస్తుంటారు. ఈ సినిమాలలో వచ్చే కొన్ని సీన్స్ ను అదేపనిగా చూస్తూ ఎక్కడలేని ఎనర్జీని తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక మహిళ ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ను వదలి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది. ఇక చెప్పేదేముంది. రచ్చరంబోలా సీన్స్, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా కేక పెట్టిస్తుంది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో
‘Killing Me Softly’ ఒక ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం. చైనీస్ దర్శకుడు చెన్ కైగే దర్శకత్వంలో హీథర్ గ్రాహం, జోసెఫ్ ఫియన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నిక్కీ ఫ్రెంచ్ రాసిన 1999 నవల ఆధారంగా తీయబడింది. ఈ చిత్రం 2002 మే 10న థియేటర్లలో విడుదలైంది. IMDbలో 5.4/10 రేటింగ్‌తో ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
అలిస్ (హీథర్ గ్రాహం) ఒక అమెరికన్ మహిళ. లండన్‌లో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తూ, తన ప్రియుడు జేక్ (జాసన్ హ్యూస్)తో సంబంధం పెట్టుకుని జీవిస్తుంటుంది. అయితే వీళ్ళిద్దరిమధ్య యవ్వారం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఒక రోజు ఆమె ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆడమ్ టాలిస్ (జోసెఫ్ ఫియన్స్) అనే వ్యక్తిని కలుస్తుంది. ఇక ఇద్దరి మధ్య ఫీలింగ్స్ మొదలవుతాయి. ఇప్పుడు అలిస్ తన జీవితంలో రెట్టింపు ఉత్సాహంతో ఆడమ్‌తో తీవ్రమైన సంబంధంలోకి దిగుతుంది. వారు కలిసిన తొలి రోజే, ఆడమ్ ఇంటికి వెళ్లి ఏకాంతంగా గడుపుతారు. ప్రతిరోజూ పండగచేసుకుంటూ ఉంటారు. ఇతని సంబంధంలో ఆమెకు ఎక్స్ట్రా థ్రిల్లింగ్ ఉండటంతో జేక్‌తో తన సంబంధాన్ని విడిచిపెడుతుంది. ఆడమ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది.
ఆడమ్ ఒక ప్రసిద్ధ పర్వతారోహకుడు. ఒక ప్రమాదంలో ఆరుగురిని రక్షించిన హీరోగా పేరు పొందాడు. కానీ ఆ ఘటనలో అతను ప్రేమించిన మహిళ చనిపోయి ఉంటుంది. అలిస్, ఆడమ్ త్వరలోనే వివాహం చేసుకుంటారు. కానీ అలిస్‌కు ఆడమ్ గురించి చాలా తక్కువ తెలుసు. వివాహం తర్వాత, ఆమెకు ఆడమ్‌ను నమ్మవద్దని కొన్ని హెచ్చరికలు కూడా వస్తాయి. ఆడమ్ కప్‌బోర్డ్‌లో, ఆమె పాత ప్రేమికురాలు అడెలె రాసిన లేఖలను కనిపెడుతుంది. అడెలె ఎనిమిది నెలల క్రితం అదృశ్యమైనట్లు తెలుస్తుంది. ఇప్పుడు అలిస్, ఆడమ్ గతంలో రహస్యాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అతనిపై అత్యాచారం, ఇతర మహిళల అదృశ్యాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also : అర్ధరాత్రి వింత శబ్దాలు… మనుషులతో బలవంతంగా వికృత జీవి ఆ పని… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ
అలిస్, ఆడమ్‌ను అనుమానిస్తూ, అతని సోదరి డెబోరా సహాయం కోరుతుంది. ఆమె ఆడమ్‌తో కలిసి వారి హనీమూన్ క్యాబిన్‌కు వెళుతుంది. అక్కడ అడెలె అదృశ్యమైనట్లు నమ్ముతుంది. ఇక ఈ సినిమా ఊహించలేని మలుపుతో ఒక డార్క్ సైకలాజికల్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఆడమ్ నిజంగానే చెడ్డవాడా ? అలిస్, ఆడమ్ ల రిలేషన్ ఏమవుతుంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.