OTT Movie : ఒక మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఇందులో లవ్ స్టోరీ మనసుకు హత్తుకుంటుంది. ఒక క్రిమినల్ తన ప్రేమ కోసం ఆరాటపడతాడు. టోవినో థామస్, ఐశ్వర్య లక్ష్మి అద్భుతమైన కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌లు ఇష్టపడేవారికి ఇది ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘మాయానది’ (Mayaanadhi) 2017లో విడుదలైన మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. ఆషిక్ అబూ దర్శకత్వంలో, సియాద్ కోకర్, అమల్ నీరద్ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఐశ్వర్య లక్ష్మి, లీలా సాంసన్, హరీష్ ఉత్తమన్, ఇలవరసు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో 2017 డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఇది ManoramaMax, Amazon Prime, Disney+ Hotstarలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈ సినిమా ఐశ్వర్య నటన, రెక్స్ విజయన్ సంగీతం, ఆషిక్ అబూ యొక్క స్టైలిష్ దర్శకత్వానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 8.3/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
మాతన్ (టోవినో థామస్) ఒక చిన్న స్థాయి క్రిమినల్. చెన్నైలో అక్రమ కార్యకలాపాలలు చేస్తుంటాడు. అతను ఒకప్పటి కాలేజీ లవర్ అప్పు (ఐశ్వర్య లక్ష్మి)ని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ వారి సంబంధం గతంలో అతని లైఫ్ స్టైల్ కారణంగా బ్రేకప్ అవుతుంది. అప్పు ఇప్పుడు కొచ్చిలో ఒక ఆస్పిరింగ్ నటి. తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి కష్టపడుతోంది. ఆమె ఒక స్ట్రగ్లింగ్ మోడల్‌గా, ఆడిషన్స్‌కు వెళ్తూ అవకాశాలకోసం ప్రయత్నిస్తుంటుంది. కథ ఇప్పుడు ఊహించని టర్న్ తీసుకుంటుంది. మాతన్ ఒక క్రైమ్ ఆపరేషన్‌లో చిక్కుకుని, ఒక పోలీసు ఆఫీసర్ మరణానికి కారణమవుతాడు. ఈ సంఘటన అతన్ని పోలీసుల నుండి తప్పించుకునే పరిస్థితిలోకి నెట్టివేస్తుంది. అతను కొచ్చికి పారిపోతాడు. అక్కడ అతను అప్పును కలవడానికి ప్రయత్నిస్తాడు. ఆమెను మళ్లీ తన ప్రేమలో పడేలా చేయాలని కోరుకుంటాడు. అప్పు మొదట అతన్ని పట్టించుకోదు. ఎందుకంటే ఆమె మాతన్ గతంలోని క్రిమినల్ జీవితం గురించి భయపడుతుంది. అయితే వారి గత ప్రేమ బంధం వారిని మళ్లీ దగ్గర చేస్తుంది.
Read Also : భార్య ఉండగానే మరొక అమ్మాయితో… ట్విస్టుల మీద ట్విస్టులు… ఇది తెలుగు వెబ్ సిరీసే
ఇక మాతన్‌ను వెంబడిస్తున్న పోలీసులు కొచ్చిలో అతని ఆచూకీ కోసం వెతుకుతుంటారు. ఈ సమయంలో, అప్పు తన కెరీర్‌లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ తో ఇబ్బంది పడుతుంది. దీనినుంచి మాతన్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు.ఈ సినిమా ఒక భావోద్వేగ క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ఇక్కడ మాతన్ తన ప్రేమ కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటాడు. అప్పు తన కెరీర్, ప్రేమ మధ్య ఒక నిర్ణయానికి రావాల్సివస్తుంది. అప్పు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? మాతన్ క్రిమినల్ లైఫ్ ని వదిలేస్తాడా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకంటే ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.