E-Paper
Advertisement

ప్రైవేట్ వీడియో లీక్… బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య భయంకరమైన బ్లాక్‌మెయిల్ గేమ్

ప్రైవేట్ వీడియో లీక్… బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య భయంకరమైన బ్లాక్‌మెయిల్ గేమ్
Advertisement

Thriller Series OTT : బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరి సీక్రెట్స్ మరొకరికి తెలిసేంత క్లోజ్‌ గా ఉంటారు. కానీ ఆ సీక్రెట్స్ అన్నీ ఒక్కసారిగా బయటపడే పరిస్థితి వస్తే ? ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయి… నిన్నటి వరకు ప్రాణ స్నేహితుల్లా ఉన్న వాళ్లే ఒకరినొకరు అనుమానించాల్సి వస్తే ? ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన థ్రిల్లర్ సిరీస్ ‘Inside The Circle’. ఓ వీడియో చుట్టూ మొదలైన సమస్య చివరికి స్నేహాన్నే ప్రశ్నించే స్థాయికి ఎలా వెళ్తుంది ? అసలు ఈ బ్లాక్‌మెయిల్ గేమ్ వెనుక ఉన్నది ఎవరు ? సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఈ కథలో నలుగురు లైఫ్‌లాంగ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉన్న వీళ్లకు ఒకరి గురించి మరొకరికి చాలా విషయాలు తెలుసు. అందుకే వాళ్ల ఫ్రెండ్‌షిప్ చూడడానికి చాలా స్ట్రాంగ్ ‌గా అనిపిస్తుంది. కానీ ఓ లీకైన వీడియో వాళ్ల జీవితాల్లోకి వచ్చిన తర్వాత అంతా తలకిందులవుతుంది. ఆ వీడియో బయటకు వస్తే ఎవరి జీవితంలో ఏ సమస్య వస్తుందో చెప్పలేని పరిస్థితి. దీంతో అసలు వీడియో ఎవరు లీక్ చేశారు ? ఎందుకు చేశారు ? అనే ప్రశ్నలు తలెత్తుతాయి.

Advertisement

విషయం బయటకు రాకుండా ఆపడానికి ప్రయత్నించే కొద్దీ మరిన్ని సీక్రెట్స్ బయట పడుతుంటాయి. ఒకరిపై ఒకరికి అనుమానం మొదలవుతుంది. నిన్నటి వరకు నమ్మిన వ్యక్తినే ఇప్పుడు నమ్మలేని పరిస్థితి వస్తుంది. అసలు ఇక్కడే థ్రిల్ ఉంటుంది. వీడియోను ఉపయోగించి ఎవరు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు ? వాళ్లకు ఏం కావాలి ? ఈ నలుగురిలో ఎవరి దగ్గర ఏ రహస్యం ఉంది ? అన్నది ఒక్కొక్కటిగా బయటపడుతుంది.

అదే సమయంలో ఈ కథలో ఓ పాపులర్ యాక్ట్రెస్ మరణానికి సంబంధించిన వీడియో కూడా కీలకంగా మారుతుంది. ఆ వీడియోను షేర్ చేసిన జర్నలిస్ట్ టోమాస్‌ చుట్టూ కూడా సమస్యలు మొదలవుతాయి. దాంతో ఫ్రెండ్‌షిప్ డ్రామా కాస్తా క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది. మరి ఆ నటి వీడియో ఏంటి ? లీకైన వీడియో ఏంటి ? అసలు ఆ రెండు విడియోలకు ఉన్న లింకు ఏంటి ? వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరు ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

Advertisement

Also Read : సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్… మైండ్ బ్లోయింగ్ పవర్స్ తో రివేంజ్… ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ తెలుగులో

తెలుగులో ఉందా ?

‘ఇన్శైడ్ ది సర్కిల్’ 2026లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ సిరీస్. Netflixలో 8 ఎపిసోడ్లతో అందుబాటులో ఉంది. Michel Brown, Zuria Vega, Raúl Briones ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు Alejandro Lozano క్రియేటర్‌గా వ్యవహరించారు. ఒరిజినల్ లాంగ్వేజ్ స్పానిష్ తో పాటు ఇంగ్షీషులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.

Tags

Related News

ప్రతి క్రైమ్ కళ్లముందే రీప్లే… అరుదైన కథ… అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

పెళ్లి ఫిక్స్ చేసుకోవడానికి ఒకే చోట 14 మంది… ‘బిగ్ బాస్’ను మించిన రొమాన్స్, గొడవలు… సింగిల్స్ రచ్చ పీక్స్ మావా

సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్… మైండ్ బ్లోయింగ్ పవర్స్ తో రివేంజ్… ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ తెలుగులో

వీడియో గేమ్‌ లా మనుషుల ప్రాణాలతో ఆడుకునే దేవుడు… క్రేజీ కాన్సెప్ట్… ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు

తేజ సజ్జ ‘ది ట్రేటర్స్’ తెలుగు ట్రైలర్ చూశారా? 20 మంది సెలబ్రిటీలు వీళ్లే!

నడిసముద్రంలో మిస్సింగ్ షిప్… తలుపు తీసి చూస్తే కళ్లు తేలేసే సీక్రెట్స్…’డార్క్’ మేకర్స్ మైండ్-బెండింగ్ మిస్టరీ

7 ఇయర్స్ మిస్సింగ్… పుట్టుకతో గుడ్డిదైన పిల్ల తిరిగొచ్చేసరికి కంటిచూపుతో… మెంటల్ మాస్ సిరీస్ మావా

Big Stories

Advertisement
×