E-Paper
Advertisement

సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!

సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!
Advertisement

LG 55 inch 4K TV:  ఇంట్లోనే థియేటర్ లాంటి ఫీల్ పొందాలని చూస్తున్నారా?.. అయితే మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఈ స్మార్ట్ టీవీ మీకోసమే! కేవలం రూ. 43,277 ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ ట్రెండీ స్మార్ట్ టీవీ అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, లేటెస్ట్ ఏఐ ఫీచర్లు, దద్దరిల్లే సౌండ్‌తో వస్తోంది. సాధారణ టీవీలకు భిన్నంగా ఇది మీ ఎంటర్‌టైన్‌మెంట్ లెవల్స్‌ను నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్తుంది.ప్రీమియం లుక్ కోరుకునే వాళ్లకు ఈ డిజైన్ నూటికి నూరు పాటి సెట్ అవుతుంది. బడ్టెట్ ధరలో బ్రాండెడ్ టీవీ కావాలి అంతే కాకుండా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు . దీనికి సంబంధించిన ఫూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, లుక్స్ :

ఈ టీవీని చూడగానే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే! దీని ‘లీనియర్ ఫ్లో డిజైన్’చాలా స్లీక్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. లివింగ్ రూమ్ గోడకు దీన్ని మౌంట్ చేసినా లేదా స్టాండ్ మీద పెట్టినా ఇంటి లుక్కే మారిపోతుంది. దీనిలోని బెజెల్ లెస్ స్క్రీన్ వల్ల టీవీ స్క్రీన్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది. ప్రీమియం లుక్ కోరుకునే వాళ్లకు ఈ డిజైన్ చాలా బాగా సెట్ అవుతుంది.

పిక్చర్ క్వాలిటీ & ఆల్ఫా ప్రాసెసర్:

Advertisement

ఈ టీవీకి అసలు సిసలు హైలైట్ దీని డిస్‌ప్లే, ప్రాసెసర్. ఇందులో పవర్ ఫుల్ ‘ఆల్ఫా 7 ఏఐ ప్రాసెసర్ 4కే జెన్ 9’ను వాడారు. ఇది మనం చూసే సాధారణ కంటెంట్‌ను కూడా ఇట్టే 4కే క్వాలిటీకి అప్‌స్కేల్ చేస్తుంది. దీనికి తోడు ‘నాన్యో డీటైల్ ఎన్‌హాన్సర్’, ‘హెచ్‌డీఆర్ 10 ప్రో’ సపోర్ట్ ఉండటం వల్ల రంగులు చాలా సహజంగా, క్లియర్‌గా కనిపిస్తాయి. చీకటి సీన్లలో కూడా క్లారిటీ మిస్ కాకుండా చూడొచ్చు. ఇక గేమర్స్ కోసం ఇందులో 60 హెర్ట్జ్ విఆర్ఆర్ సపోర్ట్ కూడా ఉంది. దీని వల్ల గేమింగ్ లాగ్స్ లేకుండా స్మూత్‌గా ఉంటుంది.

అదిరిపోయే సౌండ్ ఫీల్:

ఎన్ని మంచి విజువల్స్ ఉన్నా.. సౌండ్ గూజ్ బంప్స్ తెప్పించేలా లేకపోతే మజా రాదు. అందుకే.. ఎల్జీ ఇందులో ‘డాల్బీ అట్మాస్’, ‘ఏఐ సౌండ్ ప్రో (9.1.2 ఛానెల్)’ టెక్నాలజీని అందించింది. దీన్ని చూస్తున్నప్పుడు థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. అంతే కాకుండా దీనిలో మ్యూజిక్, డైలాగ్స్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తాయి. ఎక్స్‌ట్రా స్పీకర్లు పెట్టాల్సిన పనే లేకుండా ఇంట్లోనే సరైన సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.

స్మార్ట్ ఫీచర్స్ :

Advertisement

2026 ఎడిషన్ కాబట్టి ఇందులో ఫ్యూచరిస్టిక్ ఏఐ ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ‘మల్టీ ఏఐ’ సపోర్ట్ కింద గూగుల్ జెమిని, ఇతర ఫీచర్లు ఇంటిగ్రేట్ చేసి ఉన్నాయి. అంటే.. మీ వాయిస్ కమాండ్ తోనే టీవీని ఆపరేట్ చేయొచ్చు. అంతే కాకుండా.. వివిధ రకాల సమాచారం వెతకొచ్చు. అంతేకాకుండా.. లేటెస్ట్ వెబ్‌ఓఎస్ ప్లాట్‌ఫాంపై ఇది రన్ అవుతుంది. ఎల్జీ కంపెనీ దీనికి ఏకంగా 5 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అంటే రాబోయే ఐదు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదు.

Also Read:  ఇంత తక్కువ ధరకే..స్మార్ట్ టీవీ అంటే నమ్మలేరేమో!

ఇతర ఫీచర్లు:

సైబర్ సేఫ్టీ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ఈ టీవీ డేటా , ప్రైవసీ కోసం ‘సెక్యూర్డ్ బై ఎల్జీ షీల్డ్’ ప్రొటెక్షన్‌తో వస్తుంది. అలాగే.. మరింత ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రత్యేకంగా ‘ఎల్జీ ఛానెల్స్’ కూడా అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను దీంట్లో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.

ధర :

టెక్ లవర్స్, ఫ్యామిలీ ఎంటర్‌ టైన్‌మెంట్ కోరుకునే వారికి రూ. 43,277 బడ్జెట్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇన్ని అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు, 4కే విజువల్స్, అద్భుతమైన సౌండ్ సిస్టమ్‌తో వస్తున్న.. ఈ స్మార్ట్ టీవీపై ఒక లుక్ వేయడం పక్కా వర్త్. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంటర్‌ టైన్‌మెంట్ లెవల్స్ మార్చేయడానికి ఈ టీవీని మీ ఇంటికి తెచ్చేసుకోండి!

Related News

ఇంత తక్కువ ధరకే..స్మార్ట్ టీవీ అంటే నమ్మలేరేమో!

రూ.999కే 70 గంటల బ్యాటరీ బ్యాకప్! ఇలాంటి మోడల్ చూసుండరు!

జియో సంచలనం.. తక్కువ ధరకే కొత్త రూటర్ లాంచ్.. ఒకేసారి 100+ డివైజ్ కనెక్టివిటీ!

రూ.453కే హోం థియేటర్ సౌండ్..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్

Airtel బంపరాఫర్.. ప్రతీ సిమ్‌పై ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్.. విదేశాలకు వెళ్లేవారికి పండగే!

మోసపోకండి ఇలా బతకండి..సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి 5 మార్గాలు

వాట్సాప్ యూజర్లకు షట్‌డౌన్ వార్నింగ్స్..అసలు కారణాలివేనట!

Big Stories

Advertisement
×