OTT Movie : రకరకాల స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఒక వేదికగా ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరుగుతుంది. కొరియన్ అమ్మాయిలను సైనికులు ఘోరంగా వాడుకుంటారు. జపాన్ సైనికులు, కొరియన్ అమ్మాయిలకు నరకం చూపిస్తారు. ఘోరమైన ఆరాచకాలు, అత్యాచారాలతో ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కొరియన్ మూవీ పేరు ‘స్పిరిట్స్ హోమ్‌కమింగ్’ (Spirits Home coming). 2016 లో విడుదలైన ఈ మూవీకి చో జంగ్-రే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరుగుతుంది. జపాన్ సైన్యం ‘కంఫర్ట్ వుమెన్’ అనే పేరుతో అమ్మాయిలపై క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ఈ సినిమా జపనీస్ ఆక్రమణ సమయంలో, కొరియన్ మహిళలు ఎదుర్కొన్న హింసను చూపిస్తుంది. ఈ కొరియన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
1943 లో, జపాన్ ఆక్రమణలో ఉన్న కొరియాలో, జంగ్-మిన్, యంగ్-హీ 15 సంవత్సరాల యువతులను, తమ ఇళ్ల నుండి జపాన్ సైనికులు బలవంతంగా తీసుకెళ్తారు. ఒక వేల అమ్మాయిలను పంపక పోతే, వాళ్ళ తల్లి దండ్రులను చంపి తీసుకెళ్ళే వాళ్ళు. లేకపోతే వాళ్ళముందే అఘాయిత్యం చేసేవాళ్ళు. అలా తీసుకెళ్లిన వారిని చైనాలోని ఒక ‘కంఫర్ట్ స్టేషన్’ కు పంపిస్తారు. అక్కడ ఈ అమ్మాయిలు, ఇతర యువతులతో కలిసి, జపాన్ సైనికులకు లైంగిక బానిసలుగా సేవ చేయవలసి వస్తుంది. అక్కడ వీళ్ళను ‘కంఫర్ట్ విమెన్’ అని పిలిచేవాళ్ళు. ఈ దుర్భర పరిస్థితుల్లో, వారు అనేక శారీరక, మానసిక కష్టాలను ఎదుర్కొంటారు. అక్కడ చచ్చిన శవాలను కూడా వదలకుండా పని కానిస్తుంటారు. కొంత మంది అమ్మాయిలు తప్పించు కోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్ళను దారుణంగా కొట్టి చంపేస్తారు జపాన్ సైనికులు.
అయితే ఈ యుద్ధం ముగిసే సమయానికి, ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే బయటపడతారు.వాళ్ళల్లో ఒకరిని దారుణంగా పాడు చేసి చంపేస్తారు. ఇది జరిగిన దశాబ్దాల తర్వాత, 1991 లో ఒక వృద్ధ మహిళ తన స్నేహితురాలి ఆత్మతో తిరిగి కలవాలని కోరుకుంటుంది. ఆమె ఒక షామన్ అనే అమ్మాయిని కలుస్తుంది. ఆ అమ్మాయికి మరణించిన ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంటుంది. ఈ యువతి ఆత్మల కోసం ఒక హోమ్‌కమింగ్ రిచ్యువల్ నిర్వహిస్తుంది. దీనిలో జంగ్-మిన్ ఆత్మ తన కుటుంబంతో తిరిగి కలుస్తుంది. ఈ సినిమా 1943, 1991 సంఘటనల మధ్య తిరుగుతూ ఉంటుంది. గతం, వర్తమానాన్ని అనుసంధానిస్తూ, బాధితులు పడ్డ కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ చిత్రంలో జపాన్ సైన్యం, కొరియన్, ఇతర ఆసియా దేశాల మహిళలపై జరిగపిన లైంగిక బానిసత్వం గురించి తెరకెక్కింది.
Read Also : మిస్టీరియస్ ఐలాండ్ లో మాయమైన తండ్రి కోసం ఆ పని… కిక్కెకించే మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్