HariHaraVeeraMallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్, జ్యోతి కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 17వ దశాబ్దం నేపథ్యంలో సాగే పిరియాడిక్ స్టోరీ గా ఈ సినిమా రానుంది. ఈ చిత్రం మే 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చివరి షెడ్యూల్ చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు మొదలైనప్పటి నుంచి ఆలస్యం అవుతూనే ఉంది. మొదట కరోనా టైంలో షూట్ చేయడం కుదరలేదు. ఆ తర్వాత వర్షానికి సెట్ కూలిపోయి చాలా నష్టం జరిగింది. కొంత పవన్ తో షూట్ చేసిన ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయనతో కొంత సమయం దొరకాలి అన్నా చాలా కష్టంగా ఉంది. నిర్మాత అనుకున్న టైం కి సినిమా రిలీజ్ చేయగలరో లేదో అని అభిమానుల్లో ప్రశ్న తలెత్తుతుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా నిర్మాతకు, మరో కష్టం వచ్చి పడింది. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం..
నిర్మాత కి పెద్ద టాస్క్ ..
మూవీ టీమ్ కు వున్న సమయం తక్కువ, ఈ కొంత టైంలో ప్రొడక్షన్ పనులు ముగించుకొని ప్రమోషన్లు చేసుకోవాలంటే అది ఎవరికైనా అసాధ్యమయ్యే పని. సినిమా ఆలస్యం కావడంతో అభిమానుల్లో ఆశించిన స్థాయిలో ఈ సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీ హక్కులు సైతం రద్దు చేస్తారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాని ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఈసారి కూడా థియేటర్ రిలీజ్ వాయిదా పడితే, అంటే మే 9వ తారీఖున రిలీజ్ చేయకపోతే.. ఇచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని, లేదంటే అసలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని నిర్మాతలకు చెప్పినట్లుగా సమాచారం. అలా రద్దు చేసుకుంటే చాలా నష్టం వస్తుంది. ఈ వార్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులలో ఆందోళన రేపుతుంది.
ఇలా ఐతే కష్టమే ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిసారి బ్రో సినిమాతో పలకరించాడు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితం అయిపోయారు. జనసేన, టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగైదు రోజులు సినిమాకి కేటాయించడం అన్నా కూడా ఆయనకి కష్టంగానే ఉంది. ఇదంతా చూస్తుంటే అసలు హరిహర వీరమల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అనుకున్న టైం కి నిర్మాత రిలీజ్ చేయగలడా లేదా అని అభిమానులలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల కేటాయిస్తే సినిమా పూర్తి అవుతుంది. సినిమా అనుకున్న రోజుకి రిలీజ్ అవ్వాలని అభిమానులతో పాటు మనము కోరుకుందాం.
Also read: Kalyan Ram: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జాతరే.. తమ్ముడు వస్తున్నాడు