BigTV English

OTT Movie : ముగ్గురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, ఊహించని పని… మైండ్ డిస్టర్బింగ్ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ముగ్గురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, ఊహించని పని… మైండ్ డిస్టర్బింగ్ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : హర్రర్ సినిమాల్లోనూ సైకలాజికల్ హర్రర్ సినిమాలు చాలా స్పెషల్. భయపెట్టే ఎలిమెంట్స్ ఉండే ఇలాంటి సైకలాజికల్ హర్రర్ సినిమాలు సీను సీనుకో ట్విస్ట్ తో అదిరిపోతాయి. ఒకవేళ మీరు గనుక ఓటీటీలో ఇలాంటి సినిమాల కోసం వెతుకుతుంటే, ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇందులో ఊహించని ట్విస్టులు, మైండ్ డిస్టర్బింగ్ మిస్టరీ సీన్స్ ఎన్నో ఉంటాయి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


కథలోకి వెళ్తే…

‘స్ప్లిట్’ మూవీ కథ కెవిన్ వెండెల్ క్రంబ్ (జేమ్స్ మెక్‌అవోయ్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ (DID)తో బాధపడుతూ, 23 విభిన్న వ్యక్తిత్వాలను కలిగి ఉంటాడు. అంటే అపరిచితుడిలాగా అన్నమాట. ఇక ఇందులో భాగంగానే వరుసగా కిడ్నాప్ లు కూడా చేస్తాడు. కేసీ కుక్ (అన్యా టేలర్-జోయ్), క్లైర్ బెనాయిట్ (హేలీ లు రిచర్డ్‌సన్), మార్సియా (జెస్సికా సులా) అనే ముగ్గురు అమ్మాయిలను ఒక పార్కింగ్ లాట్ నుండి కిడ్నాప్ చేసి, ఒక బేస్మెంట్ లో బంధిస్తాడు.


డెన్నిస్ (కఠినమైన, OCDతో ఉన్నవాడు), పట్రిసియా (మతోన్మాద మహిళ), హెడ్విగ్ (9 ఏళ్ల బాలుడు)… చివరగా అతని అత్యంత భయంకరమైన 24వ వ్యక్తిత్వం “ది బీస్ట్”. ఈ పర్సనాలిటీలోకి మారినప్పుడు అతను అతీంద్రీయ శక్తులను గట్టిగా నమ్ముతాడు. అందుకే స్వచ్ఛంగా ఉండే వారిని బలివ్వాలని ఆలోచిస్తాడు. అతను ఇలా మారడానికి చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనే కారణం. అయితే కెవిన్ కిడ్నాప్ చేసిన అమ్మాయిలలో ఓ అమ్మాయి కేసీ తన గతం కారణంగా బీస్ట్ తో కనెక్ట్ అవుతుంది. మరోవైపు అతనికి ట్రీట్మెంట్ చేస్తున్న సైకాలజిస్ట్ డాక్టర్ కరెన్ ఫ్లెచర్ (బెట్టీ బక్లీ), అతని DID గురించి తెలుసుకుని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ చివరకు ఆమె ప్రమాదంలో పడుతుంది. తరువాత బందీలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడే కథ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. వాళ్ళను ఆపడానికి ఈ అపరిచితుడు ఏం చేశాడు? క్లైమాక్స్ లో వచ్చే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా పేరు ‘స్ప్లిట్’ (Split). పేరుకు తగ్గట్టే ఈ సినిమా ఒక సైకలాజికల్ హారర్-థ్రిల్లర్. 2016లో విడుదలైన ఈ మూవీకి నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించారు. ఇందులో జేమ్స్ మెక్‌అవోయ్ (కెవిన్ వెండెల్ క్రంబ్), అన్యా టేలర్-జోయ్ (కేసీ కుక్), బెట్టీ బక్లీ (డాక్టర్ కరెన్ ఫ్లెచర్) మెయిన్ రోల్స్ పోషించారు. సినిమా బిల్లీ మిల్లిగాన్ అనే వ్యక్తి నిజ జీవిత కేసు నుండి స్ఫూర్తి పొందింది. అతను DIDతో బాధపడుతూ, 1970లలో నేరాలకు పాల్పడిన మొదటి వ్యక్తి. ‘స్ప్లిట్’ మూవీప్రస్తుతం JioHotstar లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

Read Also : మనుషుల్ని టార్చర్ చేసి చంపే బొమ్మ… ఈ మూవీ చూశాక బొమ్మల్ని ముట్టుకోవాలంటేనే గుండె జారిపోద్ది

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×