BigTV English

OTT Movie : ఫేమస్ జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఇరుక్కునే అమ్మాయి… జైల్లో చేసే టార్చర్ కు దిమాక్ కరాబ్

OTT Movie : ఫేమస్ జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఇరుక్కునే అమ్మాయి… జైల్లో చేసే టార్చర్ కు దిమాక్ కరాబ్

OTT Movie : వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలు, సిరీస్ లు ఇష్టపడే వారి కోసమే ఈ సిరీస్. అందులోనూ సంచలనం సృష్టించిన ఓ ఇండియన్ కేసు స్పూర్తితో తీసిన ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? ఆ కేసు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…

ముంబైలోని క్రైమ్ జర్నలిజం, అండర్‌వరల్డ్, పోలీసు వ్యవస్థ మధ్య సంబంధాలను తెరపై చూపించే ఒక గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా ఇది. జగృతి పాఠక్ (కరిష్మా తన్నా) ఒక ఆబ్సెసివ్ క్రైమ్ రిపోర్ట. ఈస్టర్న్ ఏజ్ అనే వార్తాపత్రికలో డిప్యూటీ బ్యూరో చీఫ్. ఆమె ఒక సింగిల్ మదర్, తన కొడుకు నీల్‌తో ముంబైలోని ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ, తన కెరీర్‌లో పెద్ద స్కూప్‌లను (ఎక్స్‌క్లూసివ్ స్టోరీలు) వెంబడిస్తూ ముందుకు సాగుతుంది. ఆమె అండర్‌వరల్డ్ డాన్ చోటా రాజన్‌తో ఇంటర్వ్యూ సాధించడం ద్వారా తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటుంది.


జగృతి ముంబైలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌ల గురించి ఒక స్టోరీని కవర్ చేస్తుంది. అదే సమయంలో, ఆమె సహోద్యోగి, ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ జైదేబ్ సేన్ (ప్రోసెంజిత్ ఛటర్జీ) ముంబైలో బహిరంగంగా హత్యకు గురవుతాడు. ఈ హత్యకు చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని పోలీసులు నమ్ముతారు. జగృతి ఈ హత్యలో ప్రధాన నిందితురాలిగా చిత్రీకరించబడుతుంది. పోలీసులు ఆమె చోటా రాజన్‌కు జైదేబ్ సేన చిరునామా, లైసెన్స్ ప్లేట్ నంబర్‌ను అందించి, హత్యకు సహకరించిందని ఆరోపిస్తారు. ఆమె జర్నలిస్ట్‌గా తన కాంటాక్ట్స్‌ను ఉపయోగించి, ప్రత్యర్థి జర్నలిస్ట్‌ను తొలగించడానికి ప్రయత్నించిందని ఆరోపణలు ఉంటాయి. ఆమెను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద అరెస్టు చేస్తారు. ఇది తీవ్రమైన నేరాలకు మరణశిక్ష విధించే చట్టం.

జగృతి బైకుల్లా జైలులో దాదాపు ఒక సంవత్సరం గడుపుతుంది. అక్కడ ఆమె తన సహ ఖైదీలతో గొడవ పడుతుంది. తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ట్రై చేస్తుంది. మరి అందులో ఆమె పోరాటం ఎక్కడిదాకా వెళ్ళింది? ఆమె నిర్దోషి అని ఎలా ప్రూవ్ అయ్యింది? అసలు ఈ కేసులో ఆమెను ఎలా ఇరికించారు అనే విషయాన్ని తెరపై చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే?

ఇప్పుడు మనం చెప్పుకున్న స్టోరీ హిందీ సిరీస్ కు సంబంధించినది. ఈ సిరీస్ పేరు “స్కూప్” (Scoop). జిగ్నా వోరా జీవితం ఆధారంగా రూపొందింది. హన్సల్ మెహతా, మృణ్మయీ లాగూ వైకుల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో కరిష్మా తన్నా (జగృతి పాఠక్), మొహమ్మద్ జీషాన్ అయూబ్ (ఇమ్రాన్), హర్మన్ బవేజా (JCP ష్రాఫ్), ప్రోసెంజిత్ ఛటర్జీ (జైదేబ్ సేన్), ఇనాయత్ సూద్ (దీపా), దేవేన్ భోజానీ తదితరులు నటించారు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ Behind Bars in Byculla: My Days in Prison అనే బుక్ ఆధారంగా తెరకెక్కింది. జిగ్నా వోరా, ఆసియన్ ఏజ్ రిపోర్టర్. 2011లో జ్యోతిర్మోయ్ దే హత్య కేసులో అరెస్టు అయ్యింది. ఆమె చోటా రాజన్‌కు సమాచారం అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. 9 నెలలు బైకుల్లా జైలులో గడిపి, 2018లో నిర్దోషిగా విడుదలైంది. ఎందుకంటే పోలీసులు ఆమెపై మోపిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) OTT ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది.

Read Also  : అమ్మాయితో ఆ పని చేస్తూ మధ్యలోనే పరలోకానికి… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×