Mega 158:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. నేటితరం యంగ్ హీరోలకు, స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరింత బిజీగా దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న చిరంజీవి.. అందులో భాగంగానే వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి 158వ చిత్రం శ్రీకాంత్ ఓదెల (Srikanth odala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. ప్రస్తుతం చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vasistha mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. మరొకవైపు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తన 157వ సినిమాను కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి నెలలో విడుదల కాబోతోంది. మరోవైపు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో 158వ సినిమాను ప్రకటించారు. ముఖ్యంగా మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి నట విశ్వరూపం మళ్లీ ఈ సినిమాలో కనిపించబోతోంది అని అంచనాలు పెంచేశారు. అటు ఈ సినిమా పనుల్లో కూడా చిరంజీవి నిమగ్నమయ్యారని చెప్పాలి
చిరంజీవి కోసం రంగంలోకి బాలీవుడ్ భామలు..
ఇక ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటికే రెండు రకాల ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా కోసం బాలీవుడ్ తారలను రంగంలోకి దింపబోతున్నారు డైరెక్టర్. అందులో భాగంగానే మొదట బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ (Rani Mukherjee) పేరు వినిపించింది. చిరంజీవి వయసుకి ఆమె పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని, అందుకే ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈమె కంటే ఆ పాత్రకు బాలీవుడ్ సంచలనం దీపికా పదుకొనే (Deepika Padukone) అయితే బాగుంటుందని మరో కొత్త ప్రపోజల్ వచ్చిందట. వాస్తవానికి నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ‘కల్కి 2898AD’ సినిమాతో అటు నార్త్ లో ఇటు సౌత్ లో కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది దీపిక పదుకొనే. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా రేంజ్ లో ఈమెకు గుర్తింపు ఉన్న కారణంగా ఈమెను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ కూడా ఉంటుందని, ఆ పాత్రకు రాణి ముఖర్జీని తీసుకోవాలని భావిస్తున్నారు.
చిరంజీవి సినిమాకు హీరోయిన్ల కొరత..
ఇదిలా వుండగా మెగాస్టార్ లాంటి లెజెండ్రీ నటుల సినిమాల్లో నటించాలని ప్రతి ఒక్క నటి కోరుకుంటూ ఉంటుంది. కానీ వయసు రీత్యా కొన్ని అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలకు, హీరోయిన్లు సెట్ అవ్వడం అన్నది అంత తేలికగా జరిగే పని కాదు. ఇప్పటికే చిరంజీవి 157వ సినిమా హీరోయిన్ విషయంలో కూడా ఇదే కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార (Nayanthara) ను అడిగితే, ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), తమన్నా (Tamannaah ) లాంటి వాళ్ళని తీసుకున్న వాళ్లు పెద్దగా సినిమాకి కలిసి రారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలు ఎంత మేరా నిజం అవుతాయో చూడాలి.
ALSO READ:JVAS: శ్రీదేవి, చిరంజీవి అప్పట్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా..?