BigTV English

Squid Game Season 3 : మోస్ట్ అవైటింగ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్ 3’ టీజర్ రిలీజ్ కి డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Squid Game Season 3 : మోస్ట్ అవైటింగ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్ 3’ టీజర్ రిలీజ్ కి డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Squid Game Season 3 : మోస్ట్ అవైటింగ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ గురించి ఓటీటీ మూవీ లవర్స్ కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సిరీస్ లో ఇదే చివరి భాగం కాబోతోంది. పైగా సీజన్ 1 మెప్పించినంతగా, రెండవ సీజన్ ఆకట్టుకోలేకపోయింది. మూడవ సీజన్ లో మాత్రం మేకర్స్ అదిరిపోయే ట్విస్ట్ లు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘స్క్విడ్ గేమ్ 3’ టీజర్ ను ముహూర్తాన్ని ఫిక్స్ చేశామంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ఈ సిరీస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మరి టీజర్ రిలీజ్ డేట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ”స్క్విడ్ గేమ్ సీజన్ 3′ టీజర్ రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు. మే 6న ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ రిలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ కొరియా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో లీ జంగ్-జే, వీ హా-జూన్, పార్క్ సంగ్-హూన్, ఇమ్ సీ-వాన్ తదితర నటులు ఐకానిక్ ‘స్క్విడ్ గేమ్’ సైన్‌లతో ఉన్న కార్డ్‌ను పాస్ చేస్తూ, చివరలో టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ కొరియా ఈ వీడియోను షేర్ చేస్తూ “స్మైల్… మీ కోసం ప్రత్యేకమైన అప్డేట్ తీసుకొచ్చాం. స్క్విడ్ గేమ్ సీజన్ 3 టీజర్ రేపు రిలీజ్ కానుంది” అంటూ రాసుకొచ్చారు.


ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు?

‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ పూర్తి స్థాయి ట్రైలర్ మే చివరిలో నెట్‌ఫ్లిక్స్ తుడుమ్ (Tudum) ఈవెంట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్ ఇదే ఏడాది జూన్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానుంది. అంటే సీజన్ 2 విడుదలైన ఆరు నెలల తర్వాత సీజన్ 3 రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతుంది. భారతదేశంలో ఇది కొరియన్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు (తెలుగు సబ్‌టైటిల్స్‌తో సహా), తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

Read Also : చెట్టు కింద దెయ్యం… రాత్రైతే చాలు పిలల్ని పీడించే ముసల్ది… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి

కాగా ఇది స్క్విడ్ గేమ్ మూడవ, చివరి సీజన్. ఇందులో సియోంగ్ గీ-హన్ (లీ జంగ్-జే) కథను ముగించనున్నారు. హీరో మొదటి సీజన్ లో గెలిచి, ప్రాణాలతో బయట పడ్డాడు. ఇక రెండవ సీజన్ లో దాని సృష్టికర్త ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించి, మిగతా వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ప్రయత్నించాడు. సీజన్ 3లో హీరో, విలన్ మధ్య హోరాహోరీ ఫైట్ తో పాటు ప్రాణాల మీదకు తీసుకొచ్చే కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Netflix India (@netflix_in)

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×