BigTV English

Bigg Boss Prerana : రష్మిక నా ఫ్రెండ్ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు… అంతా మిస్ అండర్‌స్టాడింగ్…

Bigg Boss Prerana : రష్మిక నా ఫ్రెండ్ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు… అంతా మిస్ అండర్‌స్టాడింగ్…

Bigg Boss Prerana: బుల్లితెర నటి ప్రేరణ ఎన్నో సీరియల్స్ లో తెలుగులో నటించారు. 2017లో కన్నడ సీరియల్ హర హర మహాదేవ తో తన నటన జీవితాన్ని ప్రారంభించారు ప్రేరణ. తెలుగులో కృష్ణ ముకుందా మురారి సీరియల్ తో పాపులర్ అయ్యారు. రంగనాయకి, ఆన, ఫిజిక్స్ టీచర్, వంటి కన్నడ చిత్రాలలోనూ నటించారు. 2021లో బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె రష్మిక గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..


రష్మిక నా ఫ్రెండ్ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు…

ఓ ఇంటర్వూ లోయాంకర్ రష్మిక మీ ఫ్రెండ్ అని మీరు ఎప్పుడు చెప్పారు ఎందుకు అని ప్రేరణ ను అడగ్గా .. ప్రేరణ మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు హీరోయిన్ రష్మిక నా ఫ్రెండ్ అని చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంటర్వ్యూలో కానీ, ఎక్కడ మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నమాట బయటికి రాకూడదు అనుకున్నాను. మీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని బిగ్ బాస్ లో నన్ను అడిగారు. చాలా పెద్ద సెలబ్రిటీ ఇండస్ట్రీలో ఆమె నీకు తెలుసు అని నన్ను అడగగానే, అసలు నాగార్జునకు ఆ విషయం ఎలా తెలిసిందో నేను ఊహించలేదు. ఆమె ఇప్పుడు పెద్ద స్టేజ్ కి వెళ్ళిపోయింది. బిగ్బాస్ లో నేను ఆమె గురించి మాట్లాడితే ఏదో పాపులారిటి కోసం నేను మాట్లాడాను అనుకుంటారు. అది నాకు నచ్చలేదు అందుకే నేను మాట్లాడకూడదు అనుకున్నాను. నా ఫ్రెండ్షిప్ ని అడ్డం పెట్టుకొని నేను ఆమె గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నాగార్జున గారు ఆ క్వశ్చన్ అడగకపోతే నేను అసలు చెప్పేదాన్ని కాదు. ఇప్పుడు నాకు ఆమె గురించి మాట్లాడటం ఇష్టం లేదు ఎందుకంటే ఆవిరి ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది నేనేదో పాపులార్ అవ్వటానికే ఆమె పేరు వాడుతున్నానని అందరూ అనుకుంటారు అది నాకు ఇష్టం లేదు అని ప్రేరణ తెలిపింది.


ఆ సీరియల్ లోఆమె తో గొడవ ..

ప్రేరణ సీరియల్ గురించి మాట్లాడుతూ …కృష్ణ ముకుంద మురారి టైంలో, యశ్మీ గౌడ, నేను కలిసి కృష్ణా ముకుందా మురారి సీరియల్ చేశాము. రెండు సంవత్సరాలు మేము షూటింగ్ చేస్తే, చిన్న గొడవ జరిగి మేము ఇద్దరం మాట్లాడుకోలేదు. సెట్ లో ఆమె మాట్లాడిన విధానం నాకు నచ్చక నేను ఆమెతో మాట్లాడలేదు.దాదాపు 6 నెలలు మా మధ్య మాటలు లేవు. మా ఇద్దరి మధ్య ప్రత్యేకమైన గొడవ ఏం లేదు అయినా ఒక టైం లో నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు యష్మీ నేను నచ్చలేదు అని నా ఫేస్ మీదే చెప్పడం నేను చాలా షాక్ అయ్యాను.అని తెలిపింది .

ఇక ప్రేరణ సీరియస్ విషయానికి వస్తే ప్రస్తుత ఆమె తెలుగులో ఎటువంటి సీరియల్ లోను నటించట్లేదు. గతంలో ఆమె చేసిన కృష్ణా ముకుందా మురారి సీరియల్ 2021 నుండి 2024 వరకు మాటీవీలో టెలికాస్ట్ అయింది. ఆ సీరియల్ ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Balakrishna: నిరాడంబరుడికి నిండైన సభ.. బాలయ్యకి ఘన సన్మానం

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×