Suma Kanakala.. సుమా కనకాల (Suma Kanakala).. పిల్లల మొదలు పెద్దల వరకు ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అటు షోలను ఇటు సినిమా ఈవెంట్లను సింగిల్ హ్యాండ్ తో ఫినిష్ చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా షో ఏదైనా సుమా ఉండాల్సిందే. పెద్ద పెద్ద సినిమా ప్రాజెక్ట్ ఈవెంట్ లు ఏవైనా సరే.. సుమా రావాల్సిందే అన్నంతగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. మలయాళం కుట్టి అయిన ఈమె తెలుగు నటుడిని వివాహం చేసుకొని.. తెలుగమ్మాయిగా మారిపోయింది. చక్కగా తెలుగు మాట్లాడుతూ తెలుగు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలా తన భాషతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది .ఇక సుమ మల్టీ టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సొంతంగా ఛానల్ నిర్వహిస్తూ.. ఆ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది.. అంతే కాదండో సినిమాలలో కూడా నటిస్తూ అబ్బురపరిచిన ఈమె.. తాజాగా మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక్కడ బోలెడంత కామెడీ తోపాటు రుచికరమైన వంటలు కూడా ఆస్వాదించవచ్చట. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
కుకింగ్ షోతో ఆడియన్స్ ముందుకి వస్తున్న సుమా..
గత రెండు దశాబ్దాలకు పైగా టెలివిజన్ రంగంలో హోస్ట్ గా, నిర్మాతగా, నటిగా దూసుకుపోతున్న సుమా.. ఇప్పుడు ఓటీటీలోకి ఒక షోతో రాబోతోంది. వంటల కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించనుంది. తెలుగు వారికి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా (Aha) ఎంత చేరువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కుటుంబం అంతా కలిసి చూసేలా మంచి విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ -K” అనే షో తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది సుమా. “ఇది జస్ట్ కుకింగ్ షో మాత్రమే కాదండోయ్ కుకింగ్, కామెడీ ఇలా అన్ని మసాలాలు ఉన్న అల్టిమేట్ కుకింగ్ ఎంటర్టైన్మెంట్ షో. ఆహ్లాదకరమైన వంటల ప్రయాణం కోసం మీరు సిద్ధంగా ఉండండి” అంటూ ఆహా వెల్లడించింది. ఇక ఈ వంటల ప్రోగ్రామ్కి సుమ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ ప్రోగ్రాం లో రుచికరమైన వంటలను పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.
ALSO READ: Sandeep Kishan: నాలుగేళ్ల బంధం ముగిసిపోయింది.
ఐదు జోడీలతో ప్రారంభం కానున్న కుకింగ్ షో..
ముఖ్యంగా ఐదు జోడీలు పాల్గొంటున్నట్లుగా కూడా ఆహా టీం తెలిపింది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ -K స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు ఆహా వెల్లడించడం గమనార్హం. ఇకపోతే ఈ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎంతోమంది ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. మరి సుమా ఇప్పటికే తన వాక్చాతుర్యంతో అందరినీ అబ్బురపరిచింది. ఇప్పుడు సరికొత్తగా వంటలు రుచి చూపించడానికి సిద్ధమయ్యింది. మరి సుమా వంటలతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. ఆమె ఎలాంటి వంటలతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. వెజ్ , నాన్ వెజ్ తో పాటు భారతదేశంలో వివిధ సాంప్రదాయాలకు సంబంధించిన వంటలను మనకు పరిచయం చేయబోతోందా? అసలు ఎలాంటి వంటలతో ఇప్పుడు మనల్ని మెప్పించబోతోంది? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదిఏమైనా కుకింగ్ షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సుమ కు ఈ షో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఈ షో ఎప్పటినుంచి ప్రారంభం కాబోతోంది అనే విషయాన్ని కూడా త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.