BigTV English

Annie: నాకు సినిమా ఛాన్సులు రాకపోతే.. ఆ పని చేస్తానంటున్న యానీ పాప

Annie: నాకు సినిమా ఛాన్సులు రాకపోతే.. ఆ పని చేస్తానంటున్న యానీ పాప

Annie: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినవారు పెద్దయిన తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా మారడం చాలా అరుదుగా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరపై అలరించిన వారు.. ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా మారిపోయారు. అందులో యానీ కూడా ఒకరు. యానీ పాప పేరు చెప్పగానే ముందుగా ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘రాజన్న’. అతి చిన్న వయసులోనే ఆ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్‌లో నటించి ఇప్పటికీ అదే పేరుతో గుర్తుండిపోయింది యానీ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తను.. ఇప్పటివరకు తన కెరీర్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది.


నన్ను నమ్మారు

‘‘చిన్నప్పుడే మంచి దర్శకుల దగ్గర పనిచేయడం చాలా లక్కీగా అనిపిస్తుంది. అనుకోకుండా ఒకరోజు నా మొదటి సినిమా అయితే నాకు స్టార్‌డమ్ తీసుకొచ్చింది మాత్రం రాజన్ననే. అప్పుడు నా వయసు 11 ఏళ్లు. బుజ్జిగించడం, చాక్లెట్స్ ఇవ్వడం అనేది చైల్డ్ యాక్టర్స్‌కు చాలా కామన్. ఇలాంటివి గుర్తున్నాయి. నా చివరి సినిమా వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నింద. అందులో అస్సలు ఊహించని పాత్ర చేసే అవకాశం వచ్చింది. నేను చాలా అమాయకంగా కనిపిస్తానని కొన్ని రకాల పాత్రలు చేయడానికి నన్ను అప్రోచ్ అవుతారు. కొన్నిసార్లు దర్శకులు అదే ఫిక్స్ అయిపోతారేమో అని భయం కూడా వేస్తుంది. అలాంటప్పుడే నేను నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేయగలను అని నింద డైరెక్టర్ నమ్మారు’’ అని చెప్పుకొచ్చింది యానీ.


కామెంట్స్ చేశారు

‘‘నిందలో క్యారెక్టర్ గురించి నాకు చెప్పినప్పుడే నేను చాలా హ్యాపీ. థియేటర్లలో సినిమా హిట్ అవ్వకపోయినా ఓటీటీలో విడుదలయిన తర్వాత నాకు చాలానే ప్రశంసలు వచ్చాయి. నేను చేసిన సినిమాల్లో నాకు చాలా నచ్చింది రాజన్న. దాంతో పాటు లూజర్ సిరీస్ కూడా ఇష్టం. పర్ఫార్మెన్స్‌నే నేను ఎక్కువగా నమ్ముతాను. మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. అలాంటి పాత్రల్లో నేను బాగుంటానని నా నమ్మకం. కమర్షియల్ సినిమాలకు ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నా హైట్, పర్సనాలిటీ గురించి కామెంట్స్ చేసినవాళ్లు ఉన్నారు. కానీ మన పర్ఫార్మెన్స్ బాగుంటే మంచి కథలు వెతుక్కుంటూ వస్తాయని నేను నమ్ముతాను’’ అని తెలిపింది యానీ (Annie).

Also Read: ‘రాజా సాబ్’ అలాంటి సినిమా కాదు.. ఆసక్తికర విషయం బయటపెట్టిన మాళవికా..

అదొక్కటే కష్టం

మొదట్లో తన తల్లిదండ్రులు సినీ కెరీర్‌ను ఎంచుకునే విషయంలో సపోర్ట్ చేయకపోయినా.. మెల్లగా వారే తన నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టుగా బయటపెట్టింది యానీ. ‘‘ఇండస్ట్రీ వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది. అవకాశాలు వస్తే ఆగేది ఉండదు. కానీ ఎప్పుడు వస్తాయి అనేదాని కోసం వెయిట్ చేయాలి కాబట్టి అది తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఇది అలవాటు అయిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రుల నుండి సపోర్ట్ ఉంది. అవకాశాలు రాకపోతే మంచి అవకాశాలు కోసం ఎదురుచూస్తూ ఉంటాను’’ అంటూ తన కెరీర్ గురించి మాట్లాడింది యానీ. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది యానీ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×