BigTV English

OTT Movie : పోలీసులను సన్ ఫ్లవర్ చేసే హీరో… క్రైమ్ లోనూ కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ మూవీ

OTT Movie : పోలీసులను సన్ ఫ్లవర్ చేసే హీరో… క్రైమ్ లోనూ కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ మూవీ

OTT Movie : ఓటిటి లోకి వస్తున్న వెబ్ సిరీస్ లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ లను ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ బాలీవుడ్ నుంచి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఒక అపార్ట్మెంట్ లో జరిగిన హత్య చుట్టూ వెబ్ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …


జీ 5  (Zee 5) లో స్ట్రీమింగ్

ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘సన్‌ఫ్లవర్’ (Sunflower). వికాస్ బహల్, రాహుల్ సేన్‌గుప్తా ఈ వెబ్ సీరీస్ కి దర్శకత్వం వహించారు. దీనిని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఇందులో హాస్యనటుడు సునీల్ గ్రోవర్ సోనుగా ప్రధాన పాత్రలో నటించారు. రణ్‌వీర్ షోరే , గిరీష్ కులకర్ణి , ముకుల్ చద్దా , షోనాలి నాగరాణి , సోనాల్ ఝా, ఆశిష్ విద్యార్థి వంటి నటులు ఇందులో నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ కామెడితో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5  (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సన్ ఫ్లవర్ అపార్ట్మెంట్లో రాజ్ కపూర్ భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. ఇతని ఎదురుగా అభుజా అనే వ్యక్తి ఫ్యామిలీతో నివాసం ఉంటాడు. వీళ్ళిద్దరికీ చిన్నపాటి గొడవలు ఉంటాయి. ప్రతిరోజు రాజ్ కపూర్ ఇంటికి ఒక కొబ్బరి బొండం పార్సిల్ వస్తుంది. అందులో ఒకరోజు సిరంజి ద్వారా ఒక మెడిసిన్ వేస్తారు అభుజా ఫ్యామిలీ. ఆ తర్వాత కొద్దిసేపటికి రాజకపూర్ చనిపోతాడు. పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతారు. మరోవైపు అదే అపార్ట్మెంట్లో సోను అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఇతని మెంటాలిటీ వల్ల ఒంటరిగానే ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటాడు. ఒక అమ్మాయి వల్ల చిక్కుల్లో పడతాడు కూడా. అయితే పోలీసులు ఇతన్ని కూడా ఎంక్వయిరీ చేస్తారు. అతని ఇంట్లో ఎలకల మందు కనపడుతుంది. నిజంగానే ఎలకల్ని చంపడానికే ఆ మందు తెచ్చానని చెప్తాడు సోను.

పోస్టుమార్టం రిపోర్ట్ లో ఎలకల మందులో ఉండే ఒక మెడిసిన్, అందులో కూడా ఉంటుంది. పోలీసులు అతని మీద కూడా ఒక కన్ను వేస్తారు. పనిమనిషి తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ విచారిస్తారు పోలీసులు. రాజ్ కపూర్ మాజీ భార్యను కూడా విచారిస్తారు పోలీసులు. చివరికి పోలీసులకు క్రిమినల్ ఎవరు అనే విషయం తెలుస్తుందా? మరి ఎవరైనా ఈ హత్య చేసి ఉంటారా? అభుజా కొబ్బరిబోండంలో వేసిన మందు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5  (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్‌ఫ్లవర్’ (Sunflower) అనే ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×