Sri Tej Health Update : పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.. గత ఏడాది డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. అప్పటి నుంచి శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆ బాలుడు ఎప్పుడు కోలుకుంటాడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటివరకు అతని హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చిన డాక్టర్లు ఇప్పుడు ఎలా ఉందో కూడా సరిగ్గా చెప్పలేదు. అయితే నిజానికి శ్రీతేజ్ ఇప్పటికి అలానే ఉన్నాడని ఓ వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట..
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పుష్ప 2… ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ భారీ ర్యాలీ తో చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాల తో పోరాడుతున్నాడు. నిమ్స్ హాస్పిటల్ లో మూడు నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. కానీ అతన్ని మునుపటిలాగా తీసుకూరాలేదు.. అయితే మొన్న రిలీజ్ చేసిన శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ లో కళ్లు తెరుస్తున్నాడని కొద్దిగా పర్వాలేదని అన్నారు.. కానీ ఇప్పుడు మాత్రం శ్రీతేజ్ ను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తున్నారని సమాచారం.. ఇటీవల మరోసారి హెల్త్ బులిటెన్ ను వైద్యులు రిలీజ్ చేశారు. అందులో కూడా అతని పరిస్థితి అలానే ఉందనే చెప్పారు. తాజాగా మరోసారి అతని హెల్త్ అప్డేట్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఎలా ఉందంటే..
Also Read: అంజలి మళ్లీ ప్రేమలో పడిందా..? అతని కోసమేనా..?
ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ప్రస్తుతం అతని ఆరోగ్యం కొంతవరకు బాగానే ఉన్నా కూడా ఇప్పటివరకు లేచి నిలబడే స్థితిలో లేరు.. అయితే మూడు నెలలు పూర్తి అయిన కూడా అతని ఆరోగ్యం మాత్రం అలానే ఉందని తెలుస్తుంది. గాయపడిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందని వైద్యులు హెల్త్ బులిటన్లో వెల్లడించారు. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినడంతో అతను కుటుంబీకులను గుర్తించలేకపోతున్నారని మాట్లాడలేకపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు అతనికి స్పర్శ కూడా తెలియడం లేదని తెలుస్తుంది. పొట్టలోకి ట్యూబ్ పెట్టి ఎండో స్కోపి గ్యాస్ట్రోమి ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అతను ఎప్పటికి కోలుకుంటాడో అన్న విషయాన్ని మాత్రం వైద్యులు ఇంకా చెప్పలేక పోతున్నారు. బాలుడు ఆరోగ్యం మెరుగు అవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.