Retro OTT: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నటి పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “రెట్రో”. ఎన్నో అంచనాల నడుమ మే 1వ తేదీ భారీ స్థాయిలో విడుదల అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఇలా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిందని చెప్పాలి.
ఈ విధంగా థియేటర్ లో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మే 31వ తేదీ నుంచి తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారకంగా వెల్లడించారు.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రసారమవుతూ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మరి ఓటీటీలో ప్రసారమవుతూ ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో జయరామ్, నాజర్, ప్రకాశ్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలలో నటించారు. ఇక పూజా హెగ్డే చాలా గ్యాప్ తర్వాత సూర్య సరసన ఈ సినిమాలో నటిస్తూ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా కూడా బుట్ట బొమ్మకు కాస్త నిరాశను మిగిల్చిందని చెప్పాలి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే…పారి పాత్రలో నటించిన హీరో సూర్య చిన్నతనంలోనే పుట్టిన ఊరు తల్లిదండ్రులకు దూరమై ఒక అనాథ లాగా బ్రతుకుతూ ఉంటారు. ఇలా అనాథగా ఉన్న పారిని గ్యాంగ్ స్టర్ తిలక్ తనకు ఇష్టం లేకపోయినా, తన భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటారు. అయితే ఒకసారి శత్రువులు తిలక్ ను చంపాలని ప్రయత్నం చేయగా పారి శత్రువుల నుంచి తిలక్ ను కాపాడి అతని మనసులో నిజమైన కొడుకు స్థానాన్ని సంపాదించుకుంటారు.
ఇలా తిలక్ కొడుకుగా ఉన్న పారి అతని నీడలోనే పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారిపోతారు. ఇక పారి రుక్మిణి (పూజా హెగ్డే) ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి గొడవలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు. మరి పారి అనుకున్న విధంగా హింసకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారా? అతని గతం ఏంటి? తిలక్ తో పారికి ఎందుకు గొడవలు మొదలయ్యాయి అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.